Toxoplasmosis in Cattles: ఈ వ్యాధి పశువులు మరియు మనుషులకు కలుగు ఒక జునోటిక్ ఏక కణ పరాన్న జీవి వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీకణ వ్యవస్థ, కండర వ్యవస్థ మరియు కంటి సంబంధిత ఇబ్బందులుంటాయి.ఈ వ్యాధిని 1908వ సంవత్సరంలో మొట్ట మొదట ఆఫ్రికా దేశంలో గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యాధి అన్ని దేశాలతో పాటు మన దేశంలోని పశువులలో కూడా కలుగుతుంది.
టాక్సోప్లాస్మా గొడి అను ఏక కణ పరాన్న జీవి వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కారకం రక్తంలో టాఛి జాయింట్ దశలోను, వివిధ శరీర భాగాలలో బ్రాడిజాయింట్ దశలోను, పేడలో స్పోరులేటెడ్ ఊసిస్ట్ దశలోను ఉంటుంది. ఇది ఎక్కువగా రక్త కణాలలోను, ఎపిథీలియల్ కణాలలోను మరియు రెటిక్యూలో ఎండోథీలియల్ కణాలలోను పెరుగుతుంది.ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు మరియు మనుషులలో ఈ వ్యాధి ప్రధానంగా కలుగుతుంది.
వ్యాధి వచ్చు మార్గo: పిల్లులు వాటి మలం ద్వారా ఈ వ్యాధి కారక ఊసిస్ట్లను బయటకు వెలువరిస్తుంటాయి. వీటితో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వలన, వ్యాధి కారక క్రిములతో (బ్రాడి జాయింట్ దశ ) ఉన్న మాంసం భుజించడం వలన, తల్లి నుండి పిల్లలకు మాయ ద్వారా,ఇన్ లేషన్ మార్గం ద్వారా,తల్లి పాల ద్వారా (రి) వీర్యం ద్వారా ఈ వ్యాధి ఇతర ఆరోగ్యవంతమైన పశువులకు వ్యాపిస్తుంటుంది.
Also Read: Management of Dairy Cattle by Farmers: రైతులచే పాడి పశువుల నిర్వహణ.!
వ్యాధి లక్షణాలు:-
ఆవులు, గేదెలు మరియు గొర్రెలు, మేకలలో: తీవ్రమైన జ్వరం ఉంటుంది. లింఫ్ గ్రంథులన్ని వాచి పోయి ఉంటుంది. పశువులు ఈసుకుపోతుంటాయి. డిస్ప్నీయా లక్షణాలుంటాయి. వెనుక కాళ్ళ బలహీనత, రక్తహీనత వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
కుక్కలు మరియు పిల్లులలో: జ్వరం, బైలురుబినిమియా, లింఫ్ గ్రంథుల వాపు, రక్తహీనత, ఎన్సెఫలైటిస్, ప్రేగులు మడత పడడం, డిస్ప్నియా లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
చికిత్స:- ఆగ్లూటినేషన్ లేదా కాంప్లిమెంట్ పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన ఎటువంటి చికిత్స లేదు. కాని పైరిమేధమైన్ కి. లో శరీర బరువుకు 1.0 మి.గ్రా చొప్పున నోటి ద్వారా 5-7 రోజుల పాటు ఇవ్వవచ్చు. సల్ఫనమైడ్ కి.లో బరువుకు 100 మి.గ్రా చొప్పున 5-7 రోజుల పాటు ఇవ్వవచ్చు. జ్వరం తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషదములను, నోటి ఆంటి ఇన్ఫ్లమేటరీ ఔషదములు కూడా ఇచ్చినట్లైతే పశువులు త్వరగా కోలుకుంటాయి.పశువుల పాకల చుట్టు పిల్లులను తిరగనివ్వకూడదు. వ్యాధి వచ్చిన పశువులను మంద నుండి వేరు చెయ్యాలి. Toxoplasmosis in cattles :పశువులు మరియు గేదెలలో టాక్సోప్లాస్మోసిస్
వ్యాధి ఎలా వస్తుంది
ఈ వ్యాధి పశువులు మరియు మనుషులకు కలుగు ఒక జునోటిక్ ఏక కణ పరాన్న జీవి వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీకణ వ్యవస్థ, కండర వ్యవస్థ మరియు కంటి సంబంధిత ఇబ్బందులుంటాయి.ఈ వ్యాధిని 1908వ సంవత్సరంలో మొట్ట మొదట ఆఫ్రికా దేశంలో గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యాధి అన్ని దేశాలతో పాటు మన దేశంలోని పశువులలో కూడా కలుగుతుంది.
టాక్సోప్లాస్మా గొడి అను ఏక కణ పరాన్న జీవి వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కారకం రక్తంలో టాఛి జాయింట్ దశలోను, వివిధ శరీర భాగాలలో బ్రాడిజాయింట్ దశలోను, పేడలో స్పోరులేటెడ్ ఊసిస్ట్ దశలోను ఉంటుంది. ఇది ఎక్కువగా రక్త కణాలలోను, ఎపిథీలియల్ కణాలలోను మరియు రెటిక్యూలో ఎండోథీలియల్ కణాలలోను పెరుగుతుంది.ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు మరియు మనుషులలో ఈ వ్యాధి ప్రధానంగా కలుగుతుంది.
వ్యాధి వచ్చు మార్గo: పిల్లులు వాటి మలం ద్వారా ఈ వ్యాధి కారక ఊసిస్ట్లను బయటకు వెలువరిస్తుంటాయి. వీటితో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వలన, వ్యాధి కారక క్రిములతో (బ్రాడి జాయింట్ దశ ) ఉన్న మాంసం భుజించడం వలన, తల్లి నుండి పిల్లలకు మాయ ద్వారా,ఇన్ లేషన్ మార్గం ద్వారా,తల్లి పాల ద్వారా (రి) వీర్యం ద్వారా ఈ వ్యాధి ఇతర ఆరోగ్యవంతమైన పశువులకు వ్యాపిస్తుంటుంది.
వ్యాధి లక్షణాలు:-
ఆవులు, గేదెలు మరియు గొర్రెలు, మేకలలో: తీవ్రమైన జ్వరం ఉంటుంది. లింఫ్ గ్రంథులన్ని వాచి పోయి ఉంటుంది. పశువులు ఈసుకుపోతుంటాయి. డిస్ప్నీయా లక్షణాలుంటాయి. వెనుక కాళ్ళ బలహీనత, రక్తహీనత వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
కుక్కలు మరియు పిల్లులలో: జ్వరం, బైలురుబినిమియా, లింఫ్ గ్రంథుల వాపు, రక్తహీనత, ఎన్సెఫలైటిస్, ప్రేగులు మడత పడడం, డిస్ప్నియా లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
చికిత్స: ఆగ్లూటినేషన్ లేదా కాంప్లిమెంట్ పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన ఎటువంటి చికిత్స లేదు. కాని పైరిమేధమైన్ కి. లో శరీర బరువుకు 1.0 మి.గ్రా చొప్పున నోటి ద్వారా 5-7 రోజుల పాటు ఇవ్వవచ్చు. సల్ఫనమైడ్ కి.లో బరువుకు 100 మి.గ్రా చొప్పున 5-7 రోజుల పాటు ఇవ్వవచ్చు. జ్వరం తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషదములను, నోటి ఆంటి ఇన్ఫ్లమేటరీ ఔషదములు కూడా ఇచ్చినట్లైతే పశువులు త్వరగా కోలుకుంటాయి.పశువుల పాకల చుట్టు పిల్లులను తిరగనివ్వకూడదు. వ్యాధి వచ్చిన పశువులను మంద నుండి వేరు చెయ్యాలి.
Also Read: Lumpy Skin Disease in Cattle: లంపీ స్కిన్ వ్యాధి లేదా ముద్ద చర్మ వ్యాధి.!
Also Watch:
Must Watch: