పశుపోషణ

Fowl Pox in Poultry: కోళ్ళలో ఫౌల్ పాక్స్ వ్యాధి వుందా అయితే ఇలా చెయ్యండి.!

2
Fowl Pox
Fowl Pox

Fowl Pox in Poultry: ఈ వ్యాధి కోళ్ళలోను మరియు ఇతర పక్షులలోను వచ్చు ఒక అంటువ్యాధి. చర్మం పైన బొబ్బలు ఏర్పడుట, గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల మరియు కొన్ని సందర్భములలో డిప్లైరిటిక్ ఫామ్ కలిగి కోళ్ళు చనిపోవుట జరుగుతుంటుంది. ఈ వ్యాధి ఎవి పాక్స్ కుటుంబానికి చెందిన డి.ఎన్.ఎ వైరస్ వలన కలుగుతుంటుంది. ఈ వైరస్ కోళ్ళతో పాటు, టర్కీ, పావురాలు కూడా పెరిగి వాటిలో కూడా ఫాల్ పాక్స్ వ్యాధిని కల్గిస్థాయి.

వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- వ్యాధి బారిన పడిన పక్షులను నేరుగా తాకుట ద్వారా ఇతర కోళ్ళకు కూడా ఈ వ్యాధి కలుగుతుంటుంది. వైరస్ తో కలుషితమైన ఫోసైట్స్ ద్వారా అప్పుడప్పుడు ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంటుంది. చర్మ గాయాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంటుంది. దోమల ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరోక కోడికి రవాణా జరుగుతుంటుంది. ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 5-20 రోజుల వరకు ఉంటుంది. అన్ని వయస్సుల కోళ్ళల్లోను ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తీవ్రత శీతాకాలం మరియు వానకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఒకే షెడ్లో ఎక్కువ కోడిపిల్లలను ఉంచడం ద్వారా ఈ వ్యాధి ఇతర కోళ్ళకు సులువుగా వ్యాపిస్తుంటుంది. వ్యాధి కారక వైరస్ శరీరంలో ప్రవేశించిన తరువాత, పర్మము, కళ్ళు లేదా శ్వాసకోశ వ్యవస్థలోని ఏపిథీలియం కణాలలో పెరిగి, అక్కడ బొబ్బలను ఏర్పరుచుట ద్వారా వ్యాధి లక్షణాలు కలుగుతుంటాయి.

లక్షణాలు:- ఈ వ్యాధి కారక క్రిమి శరీరంలో ప్రవేశించిన తరువాత 5-10 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడుతుంటాయి. ఈ వ్యాధిలో మోర్బిడిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, మోకాలిటీ తక్కువగా ఉంటుంది. చర్మంపైన మరియు నోటి లోపలి భాగములలో, శ్వాసనాళములో బొబ్బలను, లేదాబొబ్బలు అన్ని కలిసిపోయి ఏర్పడిన విజ్ లాంటి మెటీరియల్ను గుర్తించవచ్చు.

Fowl Pox in Poultry

Fowl Pox in Poultry

Also Read: Sheep Pox Disease: గొర్రెలలో అమ్మోరు వ్యాధి.!

రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణాల ఆధారంగా మరియు వ్యాధి యొక్క చిహ్నముల ఆధారంగా ఈ వ్యాధిని కొంత వరకు ఊహించవచ్చు. ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించు కొనుటకు వైరస్ న్యూట్రలైజేషన్ టెస్ట్, అగార్ జెల్ ప్రిస్పిటేషన్ టెస్ట్, పాసివ్ హిమాగ్లూటినేషన్ టెస్ట్ వంటివి చేయవలసి ఉంటుంది. ఈ వ్యాధిని పిజియన్ పాక్స్ వ్యాధితో సరిపోల్చుకొనవలసి ఉంటుంది.

చికిత్స:- ఇది ఒక వైరల్ వ్యాధి కనుక, దీనికి ఎటువంటి చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండుటకు ఏదేని ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్ ఔషధాలను ఇవ్వవలసి ఉంటుంది. చర్మం పైన ఏర్పడిన బొబ్బలను ఏదేని ఒక ఆంటిసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయవచ్చు. వ్యాధి బారిన పడిన కోళ్ళను మంద నుండి వేరు చేసి, కల్లింగ్ చేయవలసి ఉంటుంది. తరువాత షెడ్ మొత్తాన్ని క్లీన్ చేయాలి.

టీకాలు:- ఈ వ్యాధికి రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో కలవు. ఒకటి పిజియన్ పాక్స్ వ్యాక్సిన్ దీనిని లేయర్ (గ్రుడ్లు పెట్టె కోళ్ళు) కోళ్ళలో ఉపయోగిస్తుంటారు. మరోకటి పౌల్ పాక్స్ వ్యాక్సిన్ దీనిని బ్రాయిలర్ కోళ్ళలో ఉపయోగిస్తుంటారు. ఫెదర్ ప్లక్ ద్వారా ఈ టీకాలను కోళ్ళలో ఇస్తుంటారు.

Also Read: Pesticides storage: పురుగు మందుల నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Leave Your Comments

Sheep Pox Disease: గొర్రెలలో అమ్మోరు వ్యాధి.!

Previous article

Female Calf Rearing:పెయ్య దూడల పెంపకంలో మెళుకువలు.!

Next article

You may also like