Erysipelas Disease in Pigs: ఇది వ్యాధి జనకమైన జాతికి చెందిన ఎరిసెస్లోట్రిక్స్ రూసియో పథియో అనే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వలన పందులలో ఎరిసెఫలస్ వ్యాధి కలుగుతుంది.
వ్యాధి కారకము :- (1) ఈ వ్యాధి ఎరిసెప్లోట్రిక్స్ రూసియో పథియా (Erysipelothrix rhusiopathiae ) అనే Gm+ve బ్యాక్టీరియా వలన వస్తుంది. (2) ఈ బ్యాక్టీరియా బాసిల్లస్ ఆకారంలో వుంటుంది. (3) దీని పెరుగుదలకు గాలి అవసరం. (4) ఈ బ్యాక్టీరియా కూడా ప్రాణాంతకమైన Exotoxin విషపదార్థాలను విడుదల చేస్తుంది.
Also Read: Poultry feeding: కోళ్ళ మేతలో పాటించవలసిన నియమాలు
వ్యాధి కారక చిహ్నములు:- (1) చర్మం పైన ఎర్రగా కందిపోయినట్టు డైమండ్ ఆకారంలో మచ్చలు
కనిపిస్తాయి. (2) గుండె యెక్క మిట్రల్ కవాటం చుట్టు క్యాలి ఫ్లవర్ ఆకారంలో కండరాలు పెరిగి ఉంటాయి. (3) చీములేని కీళ్ళ వాపును గమనించవచ్చు.
వ్యాధి నిర్ధారణ:- (1) వ్యాధి చరిత్ర ఆధారంగా (2) వ్యాధి లక్షణాలు ఆధారంగా (3) వ్యాధికారక చిహ్నములు మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా వ్యాధిని నిర్ధారించవచ్చును.
ఇతర వ్యాధులతో పోల్చుకొనుట :- స్వైన్ ఫీవర్, సాల్మోనెల్లా, ఫుట్ రాట్ మొదలగు వ్యాధులతోసరిపోల్చుకొనవలెను.
చికిత్స 🙁1) వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స :- (1) గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద పనిచేయు పెన్సిలిన్స్ (50000 1.U/kg b.w), టెట్రాసైక్లిన్ (@10mg/kg b.w), సల్ఫనమైడ్స్ @ 100 to150mg/kg b.) వంటి ఔషదాలు ఇవ్వవలెను. అంటీ సీరంను పంది పిల్లలకు 5 నుండి 40 మి.లీ చర్మం క్రింద ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
వ్యాధి లక్షణ ములకు చేయు చికిత్స :- ఆంటి ఇన్ మెటరీ, ఆంటీ అనాల్జెసిక్స్, వంటి ఔషధములను ఇచ్చినట్లైతే కీళ్ళ నొప్పి తగ్గుతుంది.
ఆధారము కల్పించు చికిత్స :- (1) పశువు యొక్క స్థితిని బట్టి అవసరమైతే విటమిన్స్, మినరల్స్, లివర్ ఎక్స్ట్రాక్ట్ వంటివి మరియు సెలైన్ వంటి ద్రావణాలను ఇచ్చినట్లైతే పశువులు తొందరగా కోలుకుంటాయి. (2) మంచి పోషక విలువలు కలిగిన దాణాలు అందించాలి.
నివారణ :- (1) వ్యాధి సోకిన పందులను వేరుచేయాలి. (2) ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్ని మరియు బూజు పట్టిన ఆహారాన్ని ఇవ్వకూడదు. (3) గాయాలు అయినప్పుడు వాటిని వెంటనే శుభ్రం చేసి చికిత్స చేయాలి.(4)పాకాలో ఎక్కువ సంఖ్యలో పందులను ఉంచరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!