MTU-1262 Marteru Paddy Seed Variety: ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ రకానికి ప్రత్యామ్నాయంగా మార్టేరు పరిశోధన స్థానం వారు రూపొందించిన ఎంటీయూ 1271 వరి వంగడం రకం అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. మార్టేరు వరి పరిశోధన స్ధానం ఖాతాలోకి మరో నూతన వరి వంగడం చేరింది. మూడేళ్ల చిరు సంచుల ప్రదర్శనలో అద్బుత ఫలితాలతో ఎంటీయూ 1271 వరి వంగడం రైతుల ముంగిటకు చేరింది. ఈనెల 19న వెలగపూడిలో జరిగిన ఏపి విత్తన కమిటీ ఉప కమిటీ సమావేశం ఈ వంగడాన్ని రాష్ట్రస్థాయిలో అధికారికంగా విడుదల చేసింది.
ఆంద్రప్రదేశ్ లో స్వర్ణ రకం వరి వంగడానిదే హవా. అధికంగా రైతులు ఈరకాన్నే సాగుచేస్తున్నారు. దానిలో రైతులు ఆధిక దిగుబడిని సాధిస్తున్నప్పటికిని తుఫాన్‌ల ధాటికి చేలు పడిపోతుంటాయి. దాంతో రైతులకు దిగుబడులు తగ్గుతున్నాయి. తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశిస్తాయి. ఈ నేపథ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా వరి పరిశోధన కేంద్రం ఎంటీయూ -1271 రకం వరి వంగడాన్ని రూపొందించారు. మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి అందరిని ఆకర్షిస్తున్నారు.
Also Read: Irradiation Onions Experiment: భారత్ లో తొలిసారి నిల్వ చేసే అరేడియేషన్ ఉల్లిపాయలపై ప్రయోగం.!
పంట కాలం 140 రోజులు..
ఈరకం ఖరీఫ్ సాగుకు అనువైనది. దోమపోటును, ఎండాకు తెగులును, అగ్గితెగులను పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది. పంట కాలం 140 రోజులు. ధాన్యం ఎరుపుగా, బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం గింజ రాలకుండా, తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగడాన్ని స్వర్ణ కంటే ఎకరాకు 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి వస్తుంది. ఎం.టి.యు 1271 రకాన్ని సాగుచేసే రైతులు.. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకొని తరువాత పంటలకు ఉపయోగించుకోవచ్చు. లేదా ఇతర రైతులకు విత్తనంగా అమ్ముకోవచ్చు. నాణ్యమైన విత్తనాన్ని పొందాలంటే కొన్ని మెలకువలు పాటించాలి.
సమిష్టి కృషితో ఎంటీయూ 1271 రకం
రాష్ట్రంలో సాగు చేస్తున్న రకాలలో బిపిటి 5204 ప్రధానమైనది సుమారు 3.50 లక్షల మంది ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే ఈరకం దోమపోటు, బ్యాక్టీరియా ఆకు రెండు తెగుళ్లను పూర్తిగా తట్టుకోలేకపోతోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగబడులు రావడం లేదు. ఎన్నో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. అందుకే మార్టేరు వరి పరిశోధన స్థానం వారు సమిష్టి కృషితో ఈ రకాన్ని రూపోందించారు.
ఎంటీయూ 1075 ఎంటీయూ 1081 రకాలను సంకర పరచిన ఎంటీయూ 1271 రూపోందించారు. ఎంటీయూ 1271 రకం అనేది సార్వకు అనుకూలమైన రకంగా రూపోందించారు. దీనికి 140 రోజుల పంట కాలం ఉంది. దోమపోటు బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోకుండా ఉంటుంది. గింజ మధ్యస్త సన్నగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలంగా ఉంటుంది. 69.7% బియ్యం దిగుబడి, ఎక్కువ నిండు గింజలు కలిగి అధిక దిగుబడినిస్తుంది. అగ్గి తెగుళ్లు, మెడ విరుపు, పొట్ట కుళ్ళు తెగుళ్లు కొంతమేర తట్టుకుంటుంది. సగటున హెక్టారుకు 6.5 నుంచి 7.0 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగిన రకం ఇది.
Also Read: Tips to Farmers in Rainy Season: అధిక వర్షాల సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు.!