Poplar Tree Farming: భారతదేశం వ్యవసాయం ఫై ఆధార పడే దేశం. మన దేశంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధార పడి బ్రతుకుతారు. మన దేశంలో రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం మొదలు పెట్టారు. విభిన్న పంటలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్న పంటలో పాప్లర్ చెట్ల పెంపకం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చెట్లకు డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది.
పాప్లర్ చెట్లని భారత దేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా సాగు చేస్తున్నారు. ఈ చెట్లని ఆసియా, అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలలో కూడా పెంచుతున్నారు. ఈ చెట్టు చెక్కతో కాగితం, లైట్ ప్లైవుడ్, చాప్ స్టిక్స్, చెక్క పెట్టెలు, అగ్గిపుల్లలు తయారు చేయడానికి వాడుతారు. అందుకే ఈ చెట్లకి డిమాండ్ మంచిగా ఉండి, రేట్ కూడా బాగా వస్తుంది.
Also Read: Bamboo Rice: ఈ బియ్యం మార్కెట్లో కిలో 500 రూపాయలు.!
ఈ చెట్లను కాటన్ వుడ్ అని పిలుస్తారు. ఈ పాప్లర్ చెట్లను 5-45 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాగు చేయవచ్చు. వేసవి కాలంలో బాగా పెరుగుతాయి. ఈ చెట్లు నాటే నేల pH 6-8.5 మధ్య ఉండాలి. చెట్ల మధ్య దూరం 12-15 అడుగులు ఉండాలి. ఒక చెట్టు కనీసం 80 అడుగులు పెరుగుతుంది. ఈ చెట్లు 5 సంవత్సరాలకి కోతకి వస్తాయి. చెట్ల పొడవు ఎక్కువగా ఉండటంతో ఈ చెట్ల మధ్య అంతర పంటగా చెరకు, పసుపు, బంగాళదుంప, కొత్తిమీర, టమోటా పండించుకోవచ్చు. ఈ పంటలతో కూడా అదనపు ఆదాయం వస్తుంది.
మన దేశంలో ఉత్తరప్రదేశ్లో చాలా మంది రైతులు ఈ పాప్లర్ చెట్లని పెంచుతున్నారు. ఈ పాప్లర్ చెట్లతో పాటు చెరకు పంట వేస్తారు. పాప్లర్ చెట్ల ద్వారా చెరకు కంటే ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. ఈ పాప్లర్ చెట్ల కొనడానికి చాలా కంపెనీలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా కూడా ఈ మొక్కలని కొనుకోవచ్చు. ఒక చెట్టుకి 4000 వరకి రేట్ ఉంది మార్కెట్లో. ఒక హెక్టారులో భూమిలో పాప్లర్ చెట్లను పెంచడం వల్ల 5 లక్షల వరకి సంపాదించవచ్చు.