Lily Cultivation: రైతులు పంట పొలంలో కలుపు తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కలుపు తీయడానికి కేవడం మహిళా కూలీలు మాత్రమే పని చేస్తారు. దగ్గరిగా నాటుకున్న పొలంలో కలుపు తీయడం చాలా కష్టం. మహిళా కూలీలకు ఈ కలుపు తీయడం వల్ల కళ్ళు, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. దానితో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. మహిళా రైతు కూలీల బాధ చూసి నంద్యాల జిల్లా, సుబ్బయ్య రైతు ఈ పరికరాని తయారు చేసారు.
ఈ పరికరం ద్వారా సళ్ళ మద్య తక్కువ దూరం ఉన్న పంటలో కలుపు తొందరగా తీసుకోవచ్చు. సుబ్బయ్య గారు ఎకరా పొలంలో సంపంగి పూవ్వుల తోటను సాగు చేస్తున్నాడు. ఈ తోటలో మొక్కకు 8 ఇంచుల దూరంలో నాటుకున్నారు. సంపంగి పూవ్వుల పెంపకంలో ముఖ్యమైన సమస్య కలుపు.
Also Read: Bonsai Tree: బాబోయ్… ఈ చెట్టుకి 9 కోట్ల రూపాయలా.!
ఈ పంటలో కలుపు చాలా తొందరగా వస్తుంది. ఈ రోజు కలుపు తీసివేస్తే మళ్ళీ వారంలోగా కలుపు వస్తుంది. సళ్ళ మద్య తక్కువ దూరం వల్ల కూడా కలుపు చేతులతో తీయడం ఇబ్బంది. దానికోసం ఒక కర్రకి ఇనుప వస్తువుతో మూడు బ్లెడ్స్ ఉండే ఒక పెట్టారు. ఆ ఫ్రేమ్ రెండో వైపు ఒక ఇనుప రాడ్ పెట్టారు.
ఈ బ్లెడ్స్ మట్టిని వాదులు చేసి, కలుపు భూమిలో నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది. ఈ ఇనుప రాడ్ వదులుగా చేసిన మట్టిని సమానంగా చేస్తుంది. దాని వల్ల పొలంలో గుంతలు లేకుండా సమానంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పంటకి ఇచ్చిన పోషకాలు మొక్కలు ఎక్కువ తీసుకోవడానికి వెళ్ళగా ఉంటుంది.
కలుపు మొక్కలు ఎక్కువ ఉంటే పంట మొక్కలకి పోషకాలు ఎక్కువ అందవు. ఈ సంపంగి పూవ్వులు రోజు కోసుకోవాలి. ఒక రోజు 20-30 కిలోలు పూవ్వుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఒక కిలోకి 50-60 రూపాయలు ఉంది. ఒక ఎకరానికి సుమారు ఒక లక్ష రూపాయలు లాభం వస్తుంది. ఈ సంపంగి తోటని ఒక్కసారి నాటితే రెండు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.
Also Read: Mango Post Harvest Practices: కోతల తర్వాత మామిడి తోటల్లో యాజమాన్యం.!