Roto Puddler: రైతులు వరి పంట పండించడానికి పొలం దున్నుకున్న తర్వాత, ఫుడ్లింగ్ చేస్తారు. ఫుడ్లింగ్ తర్వాత పొలం సమానం ఉండడానికి మళ్ళీ దున్నుకోవాల్సి వచ్చేది. దీని వల్ల రైతులకి ఖర్చు ఎక్కువ అవుతుంది. వరి పంట వేయడానికి రైతులు పొలాన్ని కనీసం రెండు లేదా మూడు సార్లు దున్నుకోవాల్సి ఉంటుంది. పంట వేయక ముందే రైతులకి పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి నల్గొండ జిల్లా రైతు వెంకటనారాయణ ఎస్.న్.కె & కో కంపెనీ వాళ్ళు తయారు చేసిన రొటో ఫుడ్డ్లేర్ వాడుతున్నాడు.
దుక్కి దున్నిన తర్వాత ఫుడ్లింగ్ కోసం రైతులు రోటోవేటర్ వాడుతారు. ఈ రోటోవేటర్ పొలంలో ఉండే మట్టిని మెత్తగా చేస్తుంది. గట్టి మట్టి ఉన్న కూడా వాటిని కూడా మెత్తగా చేస్తుంది. ఈ రోటోవేటర్ ద్వారా ఫుడ్లింగ్ చేస్తే పొలంలో కొంచం లోతులో మట్టి గట్టి లేయర్ల చేసి పంట పోలంకి ఇచ్చే నీళ్లను ఎక్కువ భూమిలోకి చొరబడ కూడా చేస్తుంది. దాని వల్ల నీటి వాడకం తక్కువ అవుతుంది.
Also Read: Portable Power Sprayer: రైతులకి మందులు పిచికారీలో శ్రమ, సమయం తగ్గించడానికి పోర్టబుల్ స్ప్రేయర్..

Roto Puddler
కానీ రోటోవేటర్ ద్వారా ఫుడ్లింగ్ చేశాక మళ్ళీ పొలాన్ని సమానంగా అవడానికి మళ్ళీ దున్నుకోవాలి. ఇలా చేయడానికి రైతులకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ రొటో ఫుడ్డ్లేర్ వాడితే ఫుడ్లింగ్తో పాటు లెవెలింగ్ కూడా ఒకేసారి అవుతుంది. దీని వల్ల రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
ఈ రొటో ఫుడ్డ్లేర్కి అరవై బ్లెడ్స్ ఉంటాయి. ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది. ఈ యంత్రం కొన్నాడానికి 1.20 లక్షలు అవుతుంది. రైతులు ఈ యంత్రం వాడితే ఖర్చుతో పాటు సమయం వృధా అవకుండా ఉంటుంది. ఈ యంత్రం కొనుగోలు చేయాలి అనుకున్న రైతులు ఎస్.న్.కె & కో కంపెనీని ఈ 9966316319 నుంబెర్ ద్వారా సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చు.
Also Read: Rudraksha Plant: రుద్రాక్ష చెట్టు ఇప్పుడు మన ప్రాంతాల్లో పెరుగుతుంది..