Fertilizer Broadcaster: పొలంలో ఎరువులు చల్లడం రైతులకు దుర్లభమైన పనిగా భావిస్తారు. బురదలో, పొలమంత నడుస్తూ ఎరువులు వేయడమనేది ఓపికతో కూడుకున్న పని. పొలంలో కణిక ఎరువులను ఏకరీతిలో, త్వరగా వేయడానికి. CIAE, భోపాల్ – NRCWA సబ్‌సెంటర్‌లో వాణిజ్య యూనిట్ రైతులకోసం ఎరువులను జల్లే యంత్రాన్ని తయారు చేసింది.
ప్రస్తుతం ఇది CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038. మరియు M/S సతీష్ ఆగ్రో ఇండస్ట్రీస్, 1/1, మహారాణి రోడ్ (శ్రీనాథ్ ఛాంబర్స్), ఇండోర్- 452 007 వారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే బ్రాడ్‌కాస్టర్‌తో రైతు శ్రమ హెక్టారుకు దాదాపు 6% ఆదా అవొచ్చు అని అంచనా.
Also Read: హైడ్రోపోనిక్‌గా పెరగడానికి అధిక విలువైన కూరగాయలు
దీనిని ఉపయోగించి ఎరువులు ఏకరీతిలో వేయవచ్చు.
ఇది ఎరువు వేసే సమయంలో యూరియా దుమ్ము నుండి రైతుని కాపాడుతుంది.
సాంప్రదాయ పద్ధతి కంటే రైతు పని ఉత్పాదకత మూడు రెట్లు పెరిగింది. దీనికి అయే ఖర్చు: రూ. 2500/-.
బ్రాడ్‌కాస్టర్ సంక్షిప్త వివరణ : ఫెర్టిలైజర్ బ్రాడ్‌కాస్టర్ వాణిజ్యపరంగా లభించే ఎరువులను మహిళా కార్మికులు వెదజల్లే లాగా బ్రాడ్‌కాస్టర్ రూపొందించారు. ఇది అజిటేటర్‌తో (ఎరువులను కలుపు భాగం) కూడిన హాప్పర్, స్ప్రెడింగ్ డిస్క్, గేర్, క్రాంక్, వెనుక వైపు కుషనింగ్ ప్యాడ్ మరియు మౌంటు కోసం షోల్డర్ ప్యాడ్‌తో కూడిన పట్టీలను అమర్చారు. దీనిని క్రాస్-మౌంట్ చేసుకోవాలి, ఒక మహిళా కూలి గట్టు నుండి 2.5 మీటర్ల దూరం వరకు ఎరువులను జల్లుతుంది.
బ్రాడ్‌కాస్టర్ తొట్టిలో ఎరువుల స్థాయిని దాని పారదర్శకంగా ఉన్న మూత నుండి చూడవచ్చు మరియు అవసరమైనప్పుడు తెరిచి నింపవచ్చు. బ్రాడ్‌కాస్టర్‌ను ఉపయోగించిన తర్వాత నీటితో శుబ్రపర్చుకోవాలి. ఒక మహిళ శుద్ధి చేసిన బ్రాడ్‌కాస్టర్‌ను సులభంగా మోయవచ్చు చేయవచ్చు మరియు దింపవచ్చు. మరొకరి సహాయంతో లేకుండా ఎరువులను జల్ల వచ్చు. దీని కెపాసిటీ గంటకు 1.15 హెక్టార్.
Also Read: చేపల పెంపకంలో యువత విజయగాథ