Mic for Protect Crops from Birds: పొలంలో విత్తనాలు వేసింది మొదలు ప్రతి దశలో రైతులకి ఎన్నో ఇబ్బందులు. వరి విత్తనాలు వేసుకున్నాక ఆ విత్తనాలని పక్షులు తిన్నకుండా కాపాడుకోవాలి. ఒక వరి పంటకే కాదు ఏ పంటకి అయిన విత్తనాలు నాటుకున్నాక లేదా చిన్న మొలక దశలో ఉన్నపుడు వాటిని పక్షులు లేదా కోడ్లు తింటూ ఉంటాయి. పంట కాపుకి వచ్చాక కూడా గింజలని పక్షులు తింటాయి. పక్షులు మాత్రమే కాదు అడవి పందులు, నెమలీలు కూడా పంటని నాశనం చేస్తుంటాయి. రైతులు వారు పొలంలో వేసిన పంటని కాపాడుకోవడానికి ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించారు. అదే రైతుల మైక్.
రైతులు పొలంలో వేసిన పంట కోసం పగలే కాదు రాత్రిళ్లు కూడా కాపలా ఉండాల్సి వస్తుంది. ఈ మైక్ వాడటం వల్ల రైతులకి పొలం మొత్తం తిరుగుతూ పక్షుల దాడికి నుంచి కాపలా సమయం, శ్రమ కూడా తగ్గుతుంది. ఈ మైక్లో పక్షుల అరుపులు, లేదా సింహం అరుపులు ఇతర పక్షుల గట్టి అరుపులు రికార్డు ఉంటుంది. ఆ మైక్లో శబ్దలకి పక్షులు పంట పొలాని దాడి చేయకుండా ఉంటాయి.
Also Read: Roto Puddler: వరి పండించే రైతుల కోసం కొత్త యంత్రం.!
ఈ మైక్లో మనం సొంతంగా అరుపులు రికార్డు చేసుకొని పక్షులని భయపెట్టి పొలంలో పంటని కాపాడుకోవచ్చు. పగటి సమయంలోనే కాకుండా ఈ మైక్ రాత్రి సమయంలో వాడితే కూడా రైతులు పంటని కాపాడుకోవచ్చు.
ఒక మైక్ ధర 700 రూపాయలు ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు నాలుగు గంటలు పని చేస్తుంది. ఈ మైక్ వాడటం వల్ల రైతులకి పొలం మొత్తం తిరిగే శ్రమ తగ్గుతుంది. ఈ మైక్ ఒక చోట ఉంచితే పొలం మొత్తం శబ్దం వస్తుంది. ఇంకా కొంత మంది రైతులు పంటని పక్షుల నుంచి కాపాడుకోవడానికి ఒక మనిషిని కూలిగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ మైక్ వాడటం ద్వారా కూలీ ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ మైక్స్ రైతులకి అందుబాటులోనే దొరుకుతున్నాయి.
Also Read: Portable Power Sprayer: రైతులకి మందులు పిచికారీలో శ్రమ, సమయం తగ్గించడానికి పోర్టబుల్ స్ప్రేయర్..