తేనె పరిశ్రమ

తేనెటీగల విషం అత్యంత ఖరీదు !

0

తేనెటీగలను పెంచడం ద్వారా తేనె ఉత్పత్తి లభిస్తుందని మనందరికీ తెలిసిందే. ఈ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల కాలిన గాయాలు మాన్పడంలో, చర్మ సౌందర్యం పెంపొందించడంలో ఉపయోగిస్తారు. రక్తహీనతను తగ్గించడంలో, స్థూలకాయాన్ని నియంత్రించడంలో, శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వును కరిగించడంలో, జీవక్రియను పెంచడంలో తేనే తోడ్పడుతుంది. అయితే తేనెటీగల పెంపకంవల్ల తేనే ఉత్పత్తితోపాటు పరోక్షంగా పంటల్లో పరపరాగ సంపర్కంలో తోడ్పడి ఇవి పంట దిగుబడులను కూడా పెంచుతాయి. తేనెటీగల పెంపకంవల్ల తేనెతో పాటు రాయల్ జెల్లీ, పుప్పొడి, మైనం, ప్రొపోలిస్ వంటివే గాక వీటినుంచి విషాన్ని కూడా సేకరిస్తారు.
తేనెటీగ విషంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటి ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్లనే ఈ విషం ఎంతో విలువైనదిగా చెప్పవచ్చు. తేనెటీగలనుంచి విషాన్ని సేకరించి ఇంజక్షన్లు కూడా తయారు చేసి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనెటీగలతో కుట్టించడం వల్ల ఆర్ద్రరైటిస్ వంటి వ్యాధులనుంచి ఉపశమనం లభిస్తుందంటారు. తేనెటీగల విషాన్ని ఎపీటాక్సిన్ అని, తేనెటీగలతో కుట్టించే విధానాన్ని ఎపీథెరపీ అని పిలుస్తారు. తేనెటీగల విషం ఖరీదు చాల ఎక్కువ. ఒక కిలో తేనెటీగల విషం సుమారు రూ. 70,00,000/- దాకా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

Leave Your Comments

పుదీనాలో ఏ రకాలు సాగుచేయాలి ?

Previous article

నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన

Next article

You may also like