వార్తలు

Fruit and Vegetable Products: వేసవిలో సౌరశక్తి ద్వారా పండ్లు, కూరగాయల ఉత్పత్తులు 

3
Fruits and Vegetables
Fruits and Vegetables
Fruit and Vegetable Products: ప్రపంచ ఆహార రంగంలో మన దేశానికి వ్యూహత్మక స్థానం ఉంది. ఆహార ఉత్పత్తిలో మరి ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఉత్పత్తిలో మన దేశం ద్వితీయ స్థానంలో ఉంది. శీఘ్రగతిన పురోభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ పరిశ్రమ అతిముఖ్యమైనది. ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగంలో, మాంసం, పౌల్టీ ఉత్పత్తులు, మత్స్య సంబంధిత ఉత్పత్తులతో పాటు పండ్లు, కూరగాయలు, గ్లోబల్‌ మార్కెటింగ్‌ రంగంలో ఊపందుకుంటున్నాయి. ప్రపంచీకరణ ద్వారా సరికొత్త ఆధునిక ఆహార పదార్ధాలు మరియ సాంప్రదాయ ఉత్పత్తులు కూడా మార్కెటింగ్‌ అవకాశాలను అందుకుంటున్నాయి.
Fruits and Vegetables

Fruits and Vegetables

ఆధునిక ప్రోసెసింగ్‌ యంత్రాలను ఉపయోగించి, భౌతిక రసాయనిక చర్యల ద్వారా ఆహార పదార్థాలలోని పోషక విలువలను జోడిరచి నాణ్యతను పెంచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలు ఈ ప్రోసెసింగ్‌ రంగంలో కుటీర పరిశ్రమల వలే చిన్న, చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా మేలు పొందవచ్చు. సాధారణంగా కొన్ని సీజన్లలో పండ్లు, కూరగాయల దిగుబడి బాగా పెరిగి మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి. వాటికి సరైన నాణ్యత ప్రమాణాలను జోడిరచి పోషక విలువలను పెంచి పండ్లు, కూరగాయల ఉత్పత్తులను, పానీయాలు, జాములు, జెల్లీలు, పొడులు, ఒరుగులు, చేసుకొని సహజమైన రుచిని సంవత్సరమంతా ఆస్వాదించవచ్చు.
పండ్లు, కూరగాయలను ఆహార పదార్ధాలుగా మార్చుకునే కొన్ని పద్ధతులను తెలుసుకుందాం….
1. సౌర శక్తి ద్వారా పండ్లను ముక్కలు చేసి ప్లెసెస్‌ రూపంలో ఎండబెట్టడం: 
యాపిల్‌, మామిడి, సపోటా, అనాస, బొప్పాయి, జామ, ద్రాక్ష, అరటి వంటి పండ్లను ఎంచుకుని ముక్కలు చేసి, వాటిలోని తేమ శాతాన్ని తగ్గించి డీ హైడ్రేషన్‌ పద్ధతి ద్వారా (10-12 శాతం) నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. నాణ్యమైన పండ్లను ఎంచుకుని కడిగి వేడి నీటిలో 900 సెం. వద్ద 2 నిమిషాలు ఉంచి వెంటనే మరలా చల్లటి నీటిలో ఒక నిమిషం పాటు ఉంచే ప్రక్రియను బ్లాంచింగ్‌ అంటారు. ఈ విధంగా చేసిన పిదప ముంచి పొడిగా ఉన్న స్టెయిన్లెస్‌ స్టీల్‌ ట్రేల పైకి వీటిని అమర్చి సోలార్‌ డ్రయ్యర్‌లో ఎండ బెట్టుకోవచ్చు. ఈ వేడి నీటిలో పండ్లను కొద్ది సేపు ఉంచినప్పుడు పండ్లలోని ఎంజైమ్లు నిర్వీర్యమై వాటిలోని నిల్వ సామర్థ్యం పెరిగి, చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. జల్లెడ బుట్టలో వేసి ఆవిరి సెగ మీద కొద్దిసేపు ఉంచటం ద్వారా కూడా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు.
ఎ. క్యారెట్‌ తో స్లైసెస్‌: క్యారెట్లలో ‘ఎ’ విటమితో పాటు ‘బి’ కాంప్లెక్స్‌ మరియు వివిధ రకాల ఖనిజాలు, పీచు పదార్ధం అధికంగా ఉన్నాయి. క్యారెట్‌ లోని ‘కెరోటిన్‌’ కంటి చూపును అభివృద్ధి పరచటమే కాక గుండె జబ్బులను నిరోధించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, పండ్లను, చిగుళ్ళను దృఢపరుస్తుంది. మంచి క్యారెట్లను తీసుకుని వాటిపై ఉన్న సన్నటి పొరను చాకుతో గీరాలి. వాటిని సమానమైన పరిమాణంలో సెసెస్‌ గా తయారుచేసుకుని వేడి నీటిలో 900 సెం. వద్ద 2 నిమిషాల పాటు బ్లాంచింగ్‌ చేసి 0.1 శాతం పొటాషియం మెటాబై సల్ఫేట్‌ ద్రావణంలో 2-3 నిమిషాలు ఉంచి ముక్కలను బయటకు తీసి సేపర్‌ లేదా కోరు ద్వారా కొబ్బరి కోరాముతో కోరాలి. ఈ విధంగా తయారైన క్యారెట్‌ కోరును ట్రేలలో ఉంచి సోలార్‌ డ్రయ్యర్లో ఉంచి ఎండ నివ్వాలి. చిన్న,చిన్న కవర్లలో ప్యాక్‌ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన క్యారెట్‌ కోరు సూట్లను, వివిధ రకాల ఆహార పదార్థాలు అనగా ఇడ్లీ, దోస, సాంబారు వంటి అన్ని ఆహార పదార్థాలలోను గార్నిష్‌ చేసుకోవచ్చు.
బి. టమాట స్లెసెస్‌: 
టమాటలో వివిధ రకాల ఫైటో కెమికల్స్‌ మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ (లైకోపిన్‌) ఉండటం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వివిధ క్యాన్సర్‌ బారినుండి నివారిస్తుంది. టమాట పండ్లలో నీరు అధికంగా ఉండుట వలన తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ. ఈ పండ్లు అన్ని సీజన్లలో లభిస్తాయి. మంచి తాజా టమాటలను ఎంచుకుని, కడిగి 900 సెం.  వద్ద వేడి నీటిలో 2 నిమిషాల పాటు బ్లాంచింగ్‌ చేయాలి. పిదప చల్లని నీటిలో ఒక నిమిషం పాటు ఉంచాలి. పిదప ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ ముక్కలను సోలార్‌ డ్రయ్యర్లో పరిశుభ్రమైన ట్రేలలో ఉంచి ఎండ బెట్టాలి. ఎండిన ముక్కలను శుభ్రంగా ప్యాక్‌ చేసుకొని మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.
ఈ విధంగా తయారైన టమాట ముక్కలను అవసరాన్ని బట్టి పౌడర్‌గా తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. ఎండిన ముక్కలను 5-10 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఈ టమాటలో విటమిన్‌ ‘సి’ 400 మి.గ్రా, లైకోపిన్‌ 175 మి.గ్రా అధికంగా ఉన్నాయి. ఈ విధంగా తయారైన పొడిని అన్ని రకాల సాంబారు, రసం, సూప్ల వంటి వాటిలో వాడుకోవచ్చును. ఎండిన టమాట ముక్కలను కూరల్లో వాడే ముందు కొంత సేపు నీటిలో ఉంచితే అవి తిరిగి మామూలు టమాటల వలే మారుతాయి. ఈ విధంగా పుదీనా, మెంతికూర, కొత్తిమీర, కొబ్బరి, ఉసిరిపొడి వంటి వివిధ రకాల ఉత్పత్తులను కూడా పొడులుగా తయారు చేసుకోవచ్చు.
సి. పుట్ట గొడుగులను ఎండ బెట్టడం: 
వర్షాకాలంలో ఈ పుట్టగొడుగులు అధికంగా పొలాల్లో గట్ల మీద, తేమ ఉండే వివిధ ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి. నాటు పుట్ట గొడుగులు ఉష్ణ ప్రాంతాల్లో విరివిగా లభిస్తాయి. ఈ పుట్టగొడుగుల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్ధాలు, మాంసకృత్తులు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎటువంటి తెగులు లేని శుభ్రమైన తెల్లని పుట్ట గొడుగులను ఎంచుకోవాలి. వీటిని ఉప్పు, పసుపు వేసిన వేడినీటిలో శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడిచి, కొనలను తుంచి పొడి బట్టలో వేసి ముక్కలుగా చేసుకోవాలి. వీటిని సోలార్‌ డ్రయ్యర్లోని స్టెయిన్లెస్‌ స్టీల్‌ ట్రేలలో ఎండనిచ్చి వాటిని చిన్న చిన్న కవర్లలో నిలువ చేసుకొని, మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.

Also Read: పాడి పరిశ్రమ స్థాపనకు ముఖ్య సూచనలు

2. సౌర శక్తి ద్వారా పండ్లతో క్యాండీలు తయారు చేయడం: 
ముందుగా తాజాగా ఉన్న బొప్పాయి, ఉసిరికాయలను తీసుకొని వాటిని ముక్కలుగా చేసి, బ్లాంచింగ్‌ చేయాలి. పచ్చి బొప్పాయి ముక్కలను పలుచని సున్నపు తేటలో 2 నిమిషాల పాటు ఉంచి తీయాలి. తయారుచేసుకుని, ఎండ బెట్టిన ఉసిరికాయలు లేదా పచ్చి బొప్పాయి ముక్కలను పంచదార సిరప్లో అనగా అర లీటరు నీటిలో ఒక కిలో పంచదార కలిపి పలుచని లేత పాకం వంటి ద్రావకం తయారుచేసి, దానిలో 5 గ్రా. నిమ్మ ఉప్పు, 5 గ్రా. ఫుడ్‌ కలర్‌ కలిపి ఈ ద్రావకంలో పచ్చి బొప్పొయి, ఉసిరి, వంటి ముక్కలను వేసి మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు పాటు ఉడకనిచ్చి తీగ పాకం వచ్చే వరకూ ఉంచి మూకుడులో ఈ పాకం పూర్తిగా పీల్చే వరకూ ఆరనివ్వాలి.
ముక్కలు పారదర్శకంగా తయారైనప్పుడు కొద్దిగ ఎస్సెన్స్‌, సోడియం బెంజోయేట్‌ 5 గ్రా. కలుపుకుని 24 గంటల అనంతరం ముక్కలను తీసివేసి మరలా ట్రేలలో ఆరనివ్వాలి. ఒక వేళ పాకం తగినంతగా పీల్చకపోతే రెండవ మారు కూడా ఇదే పద్ధతిని కొనసాగించి ఈ ద్రావకంలో 10 నిమిషాలపాటు ఉడకనిచ్చి పాకం పట్టే వరకూ 24 గంటలు ఉంచాలి. పిదప ముక్కలను సోలార్‌ డ్రయ్యర్లో ఎండ నివ్వాలి. బొప్పాయితో చేసిన ముక్కలను టూటీ-ఫ్రూటీ అంటారు. వీటిని 3-4 రంగుల్లో విడివిడిగా తయారు చేసుకుని ఆరిన పిదప వాటిని ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి వివిధ రంగుల ముక్కలను కలిపి ప్యాక్‌ చేసుకోవచ్చు. వీటినే ఫుడ్‌ క్యాండీలు అంటారు. బొప్పాయితో చేసిన టూటీ, ఫ్రూటీను, ఐస్‌ క్రీమ్‌, బ్రెడ్‌, ఫుడ్డింగ్‌, కేక్‌ వంటి ఆహార పదార్థాలలో గార్నిష్‌ చేసుకోవచ్చు.
3. పండ్ల గుజ్జుతో జెల్లీలు: 
మామిడి, జామ, సపోటా, అత్తి వంటి పండ్లతో రుచికరమైన తాండ్రను (చాప) లేదా జెల్లీ (గుజ్జు)ను వివిధ రకాల ఫ్లేవర్లతో రుచికరంగా చేసుకోవచ్చు. వీటిని చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
ఎ. మామిడి పండ్లతో జెల్లీ / తాండ్ర: 
మామిడి మన దేశంలో ఒక్క వేసవిలో లభించే పండు, రుచిలో రారాజు వంటి మామిడిలో గుజ్జు పదార్ధం మరియు పీచు పదార్థం అధికంగా ఉండుట వలన వీటికి పొడవైన బాక్స్‌ / తాండ్రగా తయారు చేసుకోవటానికి ఈ పండు అనువుగా ఉంటుంది. ఆరుబయట ఎండలో మన పూర్వీకులు ఈ తాండ్రను తయారు చేసేవారు. ఈగలు, దుమ్ము, ధూళి వీటిపై పడి అనారోగ్యం సంభవించటానికి ఆస్కారం ఉండేది. అత్యధిక ప్రాధాన్యత కలిగిన సోలార్‌ డ్రయ్యర్స్‌ ఇప్పుడు మనకు అందు బాటులో ఉన్నాయి. పోషక విలువలు తగ్గకుండా, రంగు, రుచిగా ఉండే విధంగా ఈ తాండ్రను తయారు చేసుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు: 
మామిడి పండ్ల గుజ్జు – 5 కిలోలు, పైనాపిల్‌ గజ్జు -1.5 కిలోలు, నల్ల ద్రాక్ష 1.5 కిలోలు, బొప్పాయి గుజ్జు – 2 కిలోలు, పంచదార -2 కిలోలు, లిక్విడ్‌ గ్లూకోజ్‌ – 100-250 గ్రా., సిట్రిక్‌ యాసిడ్‌ -20 గ్రా., పొటాషియం మెటా బై సల్ఫేట్‌ – 15 గ్రా., నీరు 580. మి.లీ.
తయారు చేసే విధానం: 
పంచదార, లిక్విడ్‌ గ్లూకోజ్‌, నీరు మూడిరటినీ ఒక పాత్రలో తీసుకొని కరిగించి, స్టౌవ్‌ మీద ఉంచి చిన్న మంట మీద మరిగించాలి. బాగా పండిన పండ్లను తీసుకుని పరిశుభ్రమైన నీటితో బాగా కడగాలి. నల్ల ద్రాక్ష పండ్లను 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి రసాన్ని తీసి విత్తనాలు, తొక్కలేకుండా వడకట్టాలి. మిగతా పండ్లను ముక్కలుగా చేసుకుని మందపాటి గిన్నెలో ఈ పండ్ల ముక్కలను, ద్రాక్ష రసాన్ని కలిపి కొంచెం నీరు చేర్చి, 30 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఉడికిన పండ్ల గుజ్జును వడకట్టి, ఒక పాత్రలోనికి తీసుకోవాలి.
ముందుగా సిట్రిక్‌ యాసిడ్‌ను, పెక్టినను విడి విడిగా చిన్న కప్పులలో నీటితో కరిగించి, పంచదార మరుగుతూ బుడగలు వస్తున్నప్పుడు, కరిగించిన సిట్రిక్‌ యాసిడ్‌ను ముందుగా వేయాలి. పంచదార పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉంచిన పండ్ల గుజ్జును చేర్చి, తర్వాత పొటాషియం మెటాబైసల్ఫేటను కూడా చేర్చి బాగా కలపాలి. ఇది చాలా చిక్కగా ఉండి ట్రేలు ఏటవాలుగా ఉంచి, జాలుగా కదిలించినప్పుడు నెమ్మదిగా జారుతుంది.
తయారు చేసుకున్న పండ్ల గుజ్జును సోలార్‌ డ్రయ్యర్లోని ఒకొక్క ట్రేలోని ఒక్కొక్క పొరకు ఒక కిలో చొప్పున సమాంతరంగా ఉండేలా వేయాలి. హెచ్చుతగ్గులు ఉంటే ఒక వైపు నుంచి రెండో వైపులు ఏటవాలుగా వంచి, సమతలంగా ఉండేలా చూడాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న ట్రేలను సోలార్‌ డ్రయ్యర్లో ఒక రోజంతా ఉంచి, రెండో రోజు రెండో పొరను కూడా వేసి 24 గంటలు ఉంచాలి. తయారైన జెల్లీని కావల్సిన పరిమాణంలో ఆకారంలో ముక్కలుగా చేసుకుని, ప్యాక్‌ చేసుకోవాలి. సోలార్‌ డ్రయ్యర్లను కరెంట్‌ సహాయంతో కూడా ఉపయోగించుకోవచ్చు.
బి. మిక్సిడ్‌ ఫ్రూట్‌ జెల్లీ / తాండ్ర: (మామిడి, జామ, సపోటా) 
కావలస్సిన పదార్థాలు: 
మామిడి గుజ్జు-2 కేజీలు, జామ గుజ్జు – 1.5 కేజీలు, సపోటా గుజ్జు 1.5 కేజీలు, పంచదార -2.5 కేజీలు, లిక్విడ్‌ గ్లూకోజ్‌ 100-250 గ్రా.,
సిట్రిన్‌ యాసిడ్‌ – 20 గ్రా., పొటాషియం మొటాబై సల్ఫేట్‌ – 15 గ్రా. నీరు 600 మి.లీ.
తయారు చేసే విధానం: 
పంచదార, లిక్విడ్‌ గ్లూకోజ్‌, నీరు మూడిరటినీ ఒక పాత్రలో తీసుకొని కరిగించి, స్టౌవ్‌ మీద ఉంచి చిన్న మంట మీద మరిగించాలి. బాగా పండిన పండ్లను తీసుకుని పరిశుభ్రమైన నీటితో బాగా కడగాలి. నల్ల ద్రాక్ష పండ్లను కొద్దిసేపు ఉడకనిచ్చి రసాన్ని వడకట్టాలి. మిగతా పండ్లను ముక్కలుగా చేసుకుని మందపాటి గిన్నెలో ఈ పండ్ల ముక్కలను, ద్రాక్ష రసాన్ని కలిపి కొంచెం నీరు చేర్చి, 30 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఉడికిన పండ్ల గుజ్జును వడకట్టి, ఒక పాత్రలోనికి తీసుకోవాలి. ముందుగా సిట్రిక్‌ యాసిడ్‌ను, పెక్టిన్‌ను విడి విడిగా చిన్న కప్పులో నీటితో కరిగించి, పంచదార మరుగుతూ బుడగలు వస్తున్నప్పుడు, కరిగించిన సిట్రిక్‌ యాసిడ్‌ను ముందుగా వేయాలి.
పంచదార పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉంచిన పండ్ల గుజ్జును చేర్చి తర్వాత పొటాషియం మెటాబైసల్ఫేట్‌ను కూడా చేర్చి బాగా కలపాలి. ఇది చాలా చిక్కగా ఉండి ట్రేలు ఏటవాలుగా ఉంచి, జాలుగా కదిలించినప్పుడు నెమ్మదిగా జారుతుంది. తయారు చేసుకున్న పండ్ల గుజ్జును సోలార్‌ డ్రయ్యర్లోని ఒక్కోక్క ట్రేలోని ఒక్కొక్క పొరకు ఒక కిలో చొప్పున సమాంతరంగా ఉండేలా వేయాలి. హెచ్చుతగ్గులు ఉంటే ఒక వైపు నుంచి రెండో వైపుకు ఏటవాలుగా వంచి, సమతలంగా ఉండేలా చూడాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న ట్రేలను సోలార్‌ డ్రయ్యర్‌లో ఒక రోజంతా ఉంచి, రెండో రోజు రెండో పొరను కూడా వేసి 24 గంటలు ఉంచాలి. తయారైన జెల్లీని కావల్సిన పరిమాణంలో/ ఆకారంలో ముక్కలుగా చేసుకుని, ప్యాక్‌ చేసుకోవాలి. సోలార్‌ డ్రయ్యర్లను కరెంట్‌ సహయంతో కూడా ఉపయోగించుకోవచ్చు.
ముగింపు: 
ఈ పై విధంగా క్యాండీలు, జెల్లీలు, పొడులు, సెసెస్‌ రూపంలో సౌరశక్తి ద్వారా వివిధరకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసుకుని, గ్రామీణ యువత ఉపాధి పొందాలని, తద్వారా ఆర్థిక స్వావలంబన పొందాలని ఆశిద్దాం.
డా.కె.సుమన్‌ కళ్యా ణి, ప్రధాన శాస్త్రవేత్త, ఐ.సి.ఎ.ఆర్‌. ` సి.టి.ఆర్‌.ఐ, 
రాజమహేంద్రవరం, ఫోన్‌ : 9440999035
Leave Your Comments

Dairy Industry Establishment: పాడి పరిశ్రమ స్థాపనకు ముఖ్య సూచనలు

Previous article

Sea Weed Uses: సముద్ర నాచు ఉపయోగాలు -పెంపకంలో మెళకువలు

Next article

You may also like