Water Apple Uses: వేసవిలో సహజంగా మనం ఎప్పుడూ చూడనటువంటి పండ్లను చూస్తూ ఉంటాం. అలాంటి పండ్లలో వాటర్ యాపిల్ అనేది ఒకటి. దీనినే రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా అంటూ ఉంటారు. చెప్పాలంటే చాలా మందికి ఈ పండు అసలు తెలియదు కాని ఇది ఆరోగ్యాన్ని పెంచడంలో ఒక దివ్యౌషధం.
ఈ పండ్ల యొక్క పోషకాహార ప్రొఫైల్ చాలా ప్రయోజనకరమైన అంశాలతో ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ చాలా అధిక స్థాయిలో ఉంటాయి. కావున దీని తినడం వలన రోగనిరోధక శక్తి, మరియు కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవే కాదండోయ్… ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు కూడా ఇది నిలయం. ఇవన్నీ ఎర్ర రక్త కణాల సంశ్లేషణను పెంచడంలో, ఎముకలను, కీళ్ళను బలంగా చేయడంలో, అలాగే కండరాల తిమ్మిరిని తగ్గించడంలో తోడ్పడుతుంది.
Also Read: Benefits of Eating Chicken: కోడి మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
అంతేకాకుండా, ఈ తియ్యని పండ్లలో హైడ్రేటింగ్ గుణం ఉంటుంది. నోట్లోవేయగానే కరిగిపోతుంది, ఈ వేసవిలో కలిగే దాహార్తిని కూడా దూరం చేస్తుంది. ఈ పండులో ప్రొటీన్లు, డైటరీ ఫైబర్‌లు అధికంగా ఉండటం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం, విరేచనాలు, ఉదర సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం! సున్నా కొలెస్ట్రాల్‌తో సంతృప్త కొవ్వు ఇంకా తక్కువ కేలరీలు ఉండుట మూలానా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి టేస్టీ ఆహారం. “జాంబోసిన్ “అనేది ఈ పండులో లభించే ఒక రకమైన ఆల్కలాయిడ్ ఇది పిండి పదార్ధాలను చెక్కరగా మార్చకుండా అడ్డుకొని మంచి ఫలితాలను కలిగిస్తుంది.
కావున మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పండును ఎలాంటి సందేహంలేకుండా పుష్కలంగా తినొచండోయ్! ఇంతే కాకుండా వాటర్ యాపిల్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా లేదు. సెలీనియం, జింక్‌తో పాటుగా ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాల నిధిగా ఉన్న ఈ వాటర్ యాపిల్ క్యాన్సర్, రక్తపోటు ప్రమాదాలను, గుండె సంబంధిత మరియు న్యూరో డిజెనరేటివ్ డిసార్డర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది.
Also Read: Cabbage Cultivation: క్యాబేజీ పంటలో నీటి యాజమాన్య పద్ధతులు