Vitamin B Deficiency: విటమిన్లు అనేవి చాలా రకాలు అందులో ముఖ్యమైనదే విటమిన్ B. విటమిన్ బి అనేది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వివిధ పాత్రలతో ఎనిమిది పోషకాలను సూచించే సమిష్టి. బి విటమిన్లు ఆహారాల నుండి శక్తిని విడుదల చేయడం నుండి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను రవాణా చేయడం వరకు విధులను అందిస్తాయి. విటమిన్ బి వివిధ పోషకాల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, లోపాల యొక్క లక్షణాలు పాల్గొనే విటమిన్ రకంపై ఆధారపడి ఉంటాయి. విటమిన్ B అనేది వాటి విధుల ప్రకారంగా 9 రకాలుగా విభజించబడింది.
Vitamin B1: దీనినే థయామిన్ అని అంటారు. ఈ విటమిన్ పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, చేపలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు మొదలగు ఆహారాలలో లభిస్తుంది. దీని లోపం వల్ల బేరి బేరి అనే వ్యాధి వస్తుంది. Vitamin
Vitamin B2: దీనినే రిబోఫ్లేవిన్ అని అంటారు. ఇది ఆకుకూరలు, పాలు, గుడ్లు, గింజలు, ధాన్యాలు, మాంసం, చేపలు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సమకూరుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల నాలుక ఉబ్బడం, మృదువైన మరియు బాధాకరమైన నాలుక, పగిలిన పెదవులు, ఆకలి లేకపోవడం, గొంతునొప్పి, పగుళ్లు మరియు నోటి మూలల్లో ఎర్రబారడం వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది.
Vitamin B3: దీనినే నియాసిన్ అని అంటారు. ఇది ఆకుకూరలు, పాలు, వేరుశెనగ, చిక్కుళ్ళు, టమోటాలు వంటి ఆహారాల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా, వాంతులు, డిప్రెషన్, అజీర్ణం, అలసట లాంటివి వస్తాయి.
Vitamin B4: దీనినే అడెనిన్ అని అంటారు. ఈ విటమిన్ తృణధాన్యాలు, తేనె, ప్రోపోలిస్, స్పిరులినా, కలబంద, బెర్రీలు లాంటి వల్ల లభిస్తుంది. ఈ విటమిన్ లోపం కారణంగా ఆందోళన, స్కిజోప్రెనియా, గుండె జబ్బులు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Vitamin ‘C’: రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి
Vitamin B5: దీనినే పాంటోథెనిక్ ఆమ్లం అని అంటారు. ఇది గుడ్డులోని పచ్చసొనలు, కిడ్నీ బీన్స్, ఈస్ట్, కాలేయం, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుంది. దీని లోపం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, తలనొప్పి, అలసట, డిప్రెషన్, నిద్రలేమి, జుట్టు రంగు మసకబారడం, దిగువ కాళ్లలో మంట, కీళ్ళు మరియు కండరాల్లో నొప్పి వంటివి సంభవిస్తాయి.
Vitamin B6&7: వీటినే పైరిడాక్సిన్, బయోటిన్ అని అంటారు. ఇవి పంది మాంసం, చికెన్, వేరుశెనగ, సోయాబీన్స్, వీట్జెర్మ్స్, అరటిపండ్లు, ఎర్ర మాంసం, పాలు, గుడ్లు, టమోటాలు, పండ్లలో లభిస్తాయి. వీటి లోపం వల్ల ఆందోళన, నిద్రలేమి, అలసట, ప్రీమెన్స్ట్రువల్ సమస్య, డిప్రెషన్, వికారం, కండరాల నొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటివి సంభవిస్తాయి.
Vitamin B9: దీనినే ఫోలేట్ అని అంటారు. ఇది కాలేయం, ఆకుపచ్చ కూరగాయలు, గుడ్ల లాంటి వాటిలో లభిస్తుంది. దీని లోపం వల్ల ఆకలి లేకపోవడం, జ్ఞాపకశక్తి లోపించడం, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో సమస్య లాంటివి సంభవిస్తాయి.
Vitamin B12: దీనినే సైనోకోబాలమిన్ అని అంటారు. ఇది చేపలు, గుడ్డు, మాంసం, కాలేయం వంటి వాటిలో లభిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత, బ్లైండ్ లూప్ సిండ్రోమ్, నోటి పూత, డిప్రెషన్ వంటివి వస్తాయి.
Also Read: Papaya Mask for Facial Beauty: ముఖ సౌందర్యం కోసం బొప్పాయి మాస్క్!