Tinospora Cordifolia: మన భారతదేశం ఆయుర్వేద సంపదకు గొప్ప నిలయంగా ప్రసిద్ధి చెందింది.ఈ ఆయుర్వేదంలో టీనోస్పోరా కార్డిఫోలియా అనేది ఒక ప్రసిద్ధ ఔషధ మొక్క, దీనిని వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి అనేక సంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా తిప్పతీగ, అమృత మరియు గుడూచి అనే పేర్లతో పిలుస్తారు.ఇది భారతీయ వైద్య విధానం (Indian System of Medicine) యొక్క ఒక ఆవశ్యక మూలికా మొక్కగా పరిగణించబడింది.ఈ మొక్కని జ్వరం, మూత్ర సమస్య, విరేచనాలు, చర్మ వ్యాధులు, కుష్టు, మధుమేహం, ఇంకా మరెన్నో వ్యాధుల చికిత్సలో ఉపయోగించారు.
ఆల్కలాయిడ్లు మరియు స్టెరాయిడ్లతో సహా అనేక జీవశాస్త్రపరంగా చురుకైన సమ్మేళనాలు ఈ మొక్క యొక్క వివిధ భాగాలలో ఉన్నందున, ఇది అద్భుతమైన ఔషధ ఉపయోగాలను కలిగి ఉంది. తిప్పతీగలోని ఔషధ గుణాలు అమోఘం.ఇది అద్భుతమైన ఔషధ ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన మూలిక.తిప్పతీగలో ఎక్కువగా ఉపయోగించే భాగం కాండం, అయితే దీని ఆకులను, వేర్లను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు.
Also Read: Effect of Egg white on Hair Fall: హెయిర్ ఫాల్ పై ఎగ్ వైట్ యొక్క ప్రభావం!
ఈ మొక్క తొందరగా వృధాప్యం రాకుండా చేస్తుంది, అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. తిప్పతీగ అన్ని రకాల జ్వరం, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలర్జీలు, ఆస్తమా, చర్మ సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది.అలాగే దీర్ఘకాలం పాటు నయం కాని చెత్త రకం గాయాలను కూడా ఈ మొక్క నయం చేస్తుంది, ఇది సాధారణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
తిప్పతీగలోని సారం కాలేయానికి మంచిది, అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, దగ్గు మరియు జలుబుకు చికిత్స చేస్తుంది మరియు కడుపులోని అన్ని సమస్యలను నయం చేస్తుంది. ఇది రక్తకణాల సంఖ్యను కూడా పెంచుతుంది మరియు డెంగ్యూ చికిత్సకు చాలా మంచిది.దీని యాంటీ పైరెటిక్ లక్షణాల కారణంగా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా మరియు మలేరియా వంటి అన్ని రకాల జ్వరాలను నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
ఈ మొక్క చెట్లు మరియు పొదలపై అడవిగా పెరగడాన్ని మనం చూడవచ్చు అలాగే దీని యొక్క గుండె ఆకారపు ఆకులతో సులభంగా దీన్ని గుర్తించవచ్చు. ఆకులు ఖచ్చితమైన గుండె ఆకారాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ మొక్కను ఇంట్లోని కుండలలో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్కను గుర్తించడానికి ప్రయత్నించేటప్పుడు మొక్కను దగ్గరగా చూసి ఎంచుకోవాలి, ఎందుకంటే అనేక తీగల ఆకులు కూడా గుండె ఆకారంలో ఉంటాయి. దీని ఆకులను డైరెక్టుగా తినవచ్చు అలాగే జ్యూస్ లాగా కూడా తీస్కోవచ్చు.