Dates Health Secrets: ప్రకృతి ప్రసాదించిన అనేక రకాల పండ్లలో అతి తియ్యగా, అతి మధురమైన , రుచిగా ఉండి ఎక్కువ శక్తిని ఇచ్చే పండు ఖర్జూర పండు. ఫ్రెష్ ప్రూట్స్ లో ఖర్జూర పండే బలమైన మరియు ఎక్కువ శక్తినిచ్చే పండు.100 గ్రాముల ఖర్జూరం తినడం వల్ల 144 కేలరీల శక్తి వస్తుంది. ఇది సీజనల్ గా పండుతుంది. పూర్వం రోజులలో కోల్డ్ స్టోరేజ్ లు లేనందు వల్ల ఆ నెల రోజులు మాత్రమే మార్కెట్ లోకి వచ్చేవి. మరల ఇతర రోజులలో ఖర్జూర పండు కనిపించేది కాదు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లు రావటం వల్ల సంవత్సరం పొడవునా దాన్ని దాచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ లోకి తెస్తున్నారు. అందువల్ల సంవత్సరం పొడవునా ఖర్జూర పండు తినే అవకాశం కలదు.
ఖర్జూరం తినడం వలన ఆరోగ్యానికి కలిగే మేలు :
• ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్త హీనతతో బాధపడేవారు ఈ ఖర్జూరం తినడం మంచిది.
• స్త్రీలలో సహజ ప్రసవం జరిగే అవాశాలున్నాయి.
• పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది తద్వారా మలబద్దక సమస్యలు తగ్గుతాయి.
• గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
• క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
• చర్మ సౌందర్యానికి , జుట్టు దృఢత్వానికి ఎంతగానో ఈ ఖర్జూరం సహాయ పడుతుంది.
• జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఈ ఖర్జూరం సహాయ పడుతుంది.
• ఎముకల దృఢత్వానికి కూడా ఈ ఖర్జూరం సహాయ పడుతుంది.
ఖర్జూరం 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి.
1) పండు ఖర్జూరం
2) ఎండు ఖర్జూరం
Also Read: List of Banned Pesticides: భారత దేశంలో నిషేధించబడిన క్రిమిసంహారక మరియు శిలీంద్ర నాశక మందులు
1) పండు ఖర్జూరం :
పండు ఖర్జూరం 100 గ్రాములు తీసుకుంటే 144 కేలరీల శక్తి వస్తుంది. పండు ఖర్జూరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 60% వరకు నీటి శాతం ఉంటుంది. ఖర్జూరం తింటే రక్తం పడుతుంది అంటారు గా ఆ రక్తం పట్టించే ఐరన్ అనేది ఈ పండు ఖర్జూరంలో 1 మిల్లీ గ్రాముల ఉంటుంది.పండు ఖర్జూరంలో కార్బోహైడ్రేట్స్ 34 గ్రాములు వుంటాయి. పండు ఖర్జూరంలో కాల్షియం 22 మిల్లీ గ్రాములు వుంటాయి.
పండు ఖర్జూరం ఏలా తినొచ్చు.
• మొలకలు తినేటప్పుడు పండు ఖర్జూరంను చిన్న,చిన్న ముక్కలుగా చేసుకొని ఆ మొలకలలో కలుపుకొని తినవచ్చు.
• ఇంకో విధంగా ఈ పండు ఖర్జూరంను గింజ తీసి పెస్ట్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని , బెల్లం కు బదులుగా కూరలలో, పులుసులలో ఈ పండు ఖర్జూరం పెస్ట్ ను వేసుకోవచ్చు.
• జూస్ లు తాగేటప్పుడు జూస్ లలో ఈ పండు ఖర్జూరం పెస్ట్ ను కలుపుకొని తాగవొచ్చు .
• పల్లీల లడ్డూ, డ్రై ఫ్రూట్ లడ్డూ ఇలా అనేక రకాల లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు ఈ పండు ఖర్జూరం పెస్ట్ ను బెల్లం కు బదులుగా లడ్డూల తయారిలో వాడుకోవచ్చు.
2) ఎండు ఖర్జూరం :
ఎండు ఖర్జూరం 100 గ్రాములు తీసుకుంటే 317 కేలరీల శక్తి వస్తుంది.పండు ఖర్జూరంలో నీటి శాతం తక్కువగా ఉంటుంది.సుమారుగా 15 % వరకు నీటి శాతం ఉంటుంది.ఖర్జూరం తింటే రక్తం పడుతుంది అంటారు గా ఆ రక్తం పట్టించే ఐరన్ అనేది ఈ ఎండు ఖర్జూరంలో 7.3 మిల్లీ గ్రాముల ఉంటుంది.ఎండు ఖర్జూరంలో కార్బోహైడ్రేట్స్ 76 గ్రాములు వుంటాయి.ఎండు ఖర్జూరంలో కాల్షియం 120 మిల్లీ గ్రాములు వుంటాయి. 100 మిల్లీ లీటర్ల చిక్కటి పాలలో ఎంత కాల్షియం ఉందో 100 గ్రాముల ఎండు ఖర్జూరంలో కూడా అంతే కాల్షియం ఉంది.
ఎండు ఖర్జూరం ఏలా తినొచ్చు :
ఎండు ఖర్జూరం డైరెక్ట్ గా అలా తినేయోచ్చు. ఎండు ఖర్జూరం గింజలు తీసేసి ఎండ బెట్టి, ఎండిన తరువాత మిక్సీ వేసి పొడి మెత్తగా జల్లించుకొని దానిని సవంత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని పాలల్లో పంచదార బదులు వేసుకోవచ్చు. జూసెస్ లో వేసుకోవచ్చు. ఆన్ని రకాల స్వీట్స్ లో వేసుకోవచ్చు.
షుగర్ పేషంట్స్ పండు ఖర్జూరం తినకూడదు.ఎందుకంటే త్వరగా తేలికగా జీర్ణం అయి వెంటనే రక్తంలో కలిసి చెక్కర స్థాయిలను పెంచుతాయి. మరీ తినాలి అనుకుంటే ఎండు ఖర్జూరాలు 4-5 వరకు ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు.
Also Read: Reducing Dairy Production Costs: పాడి పరిశ్రమలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి.!