Ridge Gourd Health Benefits: మనలో చాలా మంది బీరకాయ కూర అనగానే ముఖం అదోలా పెట్టేస్తు ఉంటారు. చాలా మంది దృష్టిలో బీరకాయ ఒక పనికి రాని కూర.అయితే బీరకాయ తినడం వలన అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి అని మాత్రం వారికీ తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.!
బీరకాయ లో ఉండే లక్షణాలు చక్కెర వ్యాధిని నివారించడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ యూరిన్ లోని షుగర్ లెవల్స్ తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అలాగే రక్తంలో ఇన్సూలెన్స్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.
బీరకాయ చాలా సులువుగా జీర్ణం అవుతుంది.అలాగే మలబద్దకాన్ని నివారించడంలో అత్యంత ప్రభావవంతగా పని చేస్తుంది. మొలల వ్యాధితో బాధ పడే వారికీ బీరకాయ చాలా మేలు చేస్తుంది.బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్ లో బీరకాయ తప్పనిసరిగా చేర్చుకోవాలి.ఇందులో ఉండే ఫ్యాట్ మరియు కోలేస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి.
Also Read: Snake Gourd Health Benefits: పొట్లకాయతో రోగాలకు చెక్!
బీరకాయ లో నీటి శాతం మరియు పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది.అందువల్ల త్వరగా ఆకలి వెయ్యదు.బీరకాయ ఎలాంటి అనారోగ్యాలకైన గురైనప్పుడు చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇది జీవ క్రియలను చురుగ్గా పని చేసేలా చేసి త్వరగా శరీరం కోలుకునేలా చేస్తుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ , వైరస్ లు సోకకుండా చేసి శరీరం లో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
చర్మ ఆరోగ్యానికి బీరకాయ చేసే మేలు అంత ఇంత కాదు. శరీరం పై పేరుకుపోయిన మృతకణాలు తొలగించి అలాగే చర్మం పై ఏర్పడే మచ్చలు తొలగించి మొటిమలు మరియు ముడతలు లేని చర్మన్నీ ఉంచుతుంది. అంతే కాకుండా బీరకాయ ను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది..అలాగే బీరకాయ లో యాంటీ ఇన్ ప్ల మేటరీ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.ఇది శరీరాన్ని మొత్తం శుద్ధి చేసి శరీరంలో టాక్సీన్ ను తొలగిస్తుంది.
Also Read: Pointed Gourd Cultivation (Parwal): తీగజాతి కూరగాయ పర్వాల్ సాగులో మెళుకువలు.!