Onion Juice Health Benefits: మనం చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందిఉల్లిపాయలలో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రో బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.దూదిపైన ఉల్లిపాయ రసాన్ని పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ఉల్లిపాయకు వైరస్, బాక్టీరియా వంటి వాటిని ఆకర్షించే శక్తి ఉంటుంది. దీంతో వైరస్, బాక్టీరియాలు ఉల్లిపాయ మీదకు చేరి ఉల్లిపాయ ఘాటు కారణంగా వెంటనే చనిపోతాయి. చనిపోయిన వైరస్, బాక్టీరియాల కారణంగా ఉల్లిపాయ నల్లబడుతుంది. కనుక సగం తరిగిన ఉల్లిపాయను మరుసటి రోజు ఉపయోగించకూడదు.
ఉల్లిరసంలో తేనెను కలిపి తాగడం వల్ల దగ్గుతోపాటు గొంతు సంబంధిత ఇన్ ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవడంతోపాటు వాటిని మన దగ్గర ఉంచుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో మంటతో బాధపడుతున్న వారు రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీటిలో వేసి మురిగించాలి.
Also Read: Chukka Koora Health Benefits: చుక్క కూరను తినడం వల్ల కలిగే లాభాలు.!
తరువాత ఈ నీటిని వడకట్టి తాగడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది.ఉల్లిపాయలలో అధికంగా ఉండే సల్ఫర్ బీపీని నియంత్రణలో ఉంచడంతోపాటు రక్తం నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. అర కప్పు ఉల్లిరసంలో 3 టేబుల్ స్పూన్ల తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తాగడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
గుండె సంబంధిత సమస్యలు, బీపీ వంటి వాటితో బాధపడుతున్న వారు రోజూ 100 గ్రా. ల వరకు ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిలో ఉల్లి రసాన్ని కలుపుకుని కొద్ది కొద్దిగా తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.ఉల్లిపాయలలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థాలు తదితర పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా టైప్2 మధుమేహం నివారించబడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఉల్లిపాయలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
Also Read: Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.!