ఆరోగ్యం / జీవన విధానం

National Nutrition Week 2022: జాతీయ పోషకాహార వారోత్సవాలు.!

0
Nutrition week 2022
Nutrition week 2022

National Nutrition Week 2022: స్థానిక ఆహార పంటలు, పోషక పెరటి తోటల సాగులోనే మన దేశ ఆరోగ్య భద్రత! మన దేశంలో ఆకలి కేకలు నిర్మూలించి, పోషకాహార లోపాలను అధిగమించడానికి  చేపట్టే  కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు  కేంద్ర మహిళా మరియు  శిశు సంక్షేమ శాఖ  తీసుకొచ్చినా సరికొత్త కార్యక్రమం  జాతీయ పోషణ అభియాన్‌. జాతీయ 5 వ పోషన్‌ మా- 2022 ని సెప్టెంబర్‌ 1 నుండి సెప్టెంబర్‌ 30, 2022 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొని చిన్న పిల్లల్లో పోషకాహార లోపాలను అంతం చేయాలని కృత నిశ్చయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

National Nutrition Week

National Nutrition Week

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో,  అంగన్వాడి కేంద్రంలో వివిధ అవగాహన కార్యక్రమాలు  చేపట్టి  ముఖ్యంగా చిన్న పిల్లల్లో పోషకాహార లోపాలను  అధిగమించేందుకు తీసుకోవాల్సిన బలవర్ధకమైన ఆహారం,  చిరుధాన్యాల పండిరచడం,  విరివిగా చిరుధాన్యాలను తినడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత,  స్థానికంగా పండిరచే పంటల ద్వారా సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, పెరటి తోటల పెంపకం  మొదలైన అంశాల పైన  పోషన్‌ మాసం -2022  జరుపుకోవాలని మన గౌరవ ప్రధానమంత్రి గారు  దేశ ప్రజలను కోరారు. కేంద్ర స్త్రీ మరియు శిశుసంక్షేమ శాఖ  మరియు ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బోర్డ్‌  సంయుక్తంగా 1982  నుండి  సెప్టెంబర్‌ మొదటి  వారంను  జాతీయ పోషకాహార దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుతున్నారు.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో పోషకాహార లోపాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన ఆహారము మరియు వివిధ పోషకాలు పైన  అవగాహన పెంపొందించడం. మన దేశంలోని ప్రజలందరికీ పండ్లు మరియు కూరగాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలకూరగాయల తెలిసినప్పటికీ ప్రజలు వాటిని తగిన మోతాదులో తీసుకోవడం లేదని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  గుర్తించాయి. మరొకసారి ప్రజలందరినీ చైతన్యపరిచి పోషణ మాసం లో భాగంగా  పెరటి తోటల పెంపకం, చిరుధాన్యాల తో చేసిన ఆహారాన్ని విరివిగా తీసుకోవడం  మరియు తగిన మోతాదులో  కాలానుగుణంగా లభించే  వివిధ రకాల రంగులు గల కూరగాయలు, ఆకుకూరలు  మరియు పండ్లను పండిరచి విరివిగా తింటే  సరైన పోషణ లభించి దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు  అనే ఉద్దేశంతో  ‘‘సహీ పోషణ్‌ దేశ్‌ రోషన్‌’’ అనే అంశాన్ని తెర ముందుకు  తీసుకు రావడం జరిగింది. పండ్లు మరియు కూరగాయలు లో మానవ శరీరానికి కావలసిన అతిముఖ్యమైన సూక్ష్మపోషకాలు  విటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు  మరియు యాంటీఆక్సిడెంట్స్‌  ఎక్కువ మోతాదులో దొరుకుతాయి.

Different Types of Fruits

Different Types of Fruits

పండ్లు కూరగాయలను ఎక్కువ మోతాదులో తినడం వలన ఆరోగ్యమైన పెరుగుదలతో పాటు  రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు కావున  చిన్న పిల్లలకు,  కిశోర బాలికలకు, ఎదిగే పిల్లలకు అందరికీ మంచి పోషణను అందించి భవిష్యత్తులో ఆరోగ్యమైన భారత్‌ ను నిర్మించడంలో  మనమందరం పాత్రులు కావాలని మన గౌరవ భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ గారు కోరారు. మన రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో పోషణ వైవిధ్యతను తీసుకురావడానికి పెరటి తోటల పెంపకం  చాలా అవసరం.

శాస్త్రీయ పద్ధతిలో పెరటి తోటల పెంపకాన్ని చేపట్టినట్లయితే కుటుంబానికి కావలసిన వివిధ వైవిధ్యమైన  కూరగాయలు మరి ఆకుకూరలను భోజనంలో తీసుకోవడం ద్వారా  ప్రజల  ఆరోగ్యం  మెరుగవుతుంది.  అంతేకాకుండా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తక్కువ ఖర్చులో  అన్ని రకాల కూరగాయలను  అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఏడాది పొడవునా కుటుంబానికి కావలసిన కూరగాయలు సేంద్రీయ పద్ధతిలో పండిరచడంతో పాటు  మరియు  కూరగాయల  కోసం  వెచ్చించే  డబ్బులు ఆదా చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోఆహారపు అలవాట్లలో మార్పు రావడం వలన చాలామంది పూర్వకాలపు ఆహార పదార్థాల నుండి  ఆధునిక కాలంలోని  బాగా పాలిష్‌ చేసిన  బియ్యం ను అన్నం గా వండుకొని తింటున్నారు. దీని వలన పోషకాహార లోపాలు మరింత అధికమయ్యాయి.

జొన్నలు మరియు చిరుధాన్యాలు  యొక్క పోషక విలువలతో పాటు, వాటిని తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పైన ఎలాంటి అవగాహన లేకపోవడం వలన  ప్రజలు వాటిని సాగు చేయడం మరియు తినడం  తగ్గించారు.  జొన్నలు మరియు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా  చక్కెర వ్యాధి,  రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు,  స్థూలకాయత్వం  వంటివి రాకుండా  ఉపయోగపడతాయని ఇప్పుడిప్పుడే అవగాహన తెచ్చుకుంటున్నారు.

మన ఆహారం మరియు మన ఆరోగ్యం గురించి మీకు తెలుసా!

Also Read: Integrated Nutrient: సాగులో సమీకృత పోషక నిర్వహణ చాలా ముఖ్యం

  •  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-2020) అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రోటీన్‌ క్యాలరీ పోషకాహార లోపం  చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో,  పాలిచ్చే తల్లులలో  ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల్లో సుమారు 31.8% పిల్లలకు  వయసుకు తగ్గ బరువు లేదు, 33.1% మంది పిల్లల్లో  వయసుకు తగ్గ ఎత్తు లేదు, 70.0%  పిల్లలు రక్తహీనత తో బాధపడుతున్నారు.
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-2020) అంచనాల ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో  అలాగే గిరిజన ప్రాంతాలలో ఐదు సంవత్సరాల్లోపు చిన్న పిల్లల్లో సుమారు 52.0% పిల్లలకు  వయసుకు తగ్గ బరువు లేదు, 45.7% మంది పిల్లల్లో  వయసుకు తగ్గ ఎత్తు లేదు,  76.3%  పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
  • సాధారణ మానవునికి రోజుకు సుమారు 2000  నుండి 2500  కేలరీల శక్తి అవసరం.
  •  జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రకారం సగటున ప్రతి రోజు, ప్రతి వ్యక్తి సుమారు 400 గ్రా. తృణధాన్యాలు లేదా మిల్లెట్స్‌  ఆహారంగా తీసుకోవాలి. తక్కువ పాలిష్‌ చేసిన ధాన్యాలను ఆహారంగా తీసుకుంటే మంచిది.
  •  జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రకారం సగటున ప్రతి రోజు, ప్రతి వ్యక్తి సుమారు 80 గ్రా. వివిధ పప్పులను ఆహారంగా తీసుకోవాలి.
  • దేశంలో ఈరోజు తలసరి పప్పుధాన్యాల లభ్యత సుమారు 24 గ్రా. కానీ ఐసీఎంఆర్‌ సూచించిన  తలసరి పప్పుధాన్యాల  వినియోగము  సుమారు 80 గ్రా.
  • జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రకారం సగటున ప్రతి రోజు, ప్రతి వ్యక్తి సుమారు 300 గ్రాముల పాలు, పాల పదార్థాలను ఆహారంగా తీసుకున్నట్లయితే శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు లభిస్తాయి.
  • చిరు ధాన్యాలను తీసుకోవడం ద్వారా  కలిగే అదనపు  ఆరోగ్య ప్రయోజనాలు  ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం,  గ్లూటెన్‌ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌, ఇతర  బయో యాక్టివ్‌ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. జొన్నలు మరియు చిరుధాన్యాల్లో సగటు కార్బోహైడ్రేట్స్‌ 56.88-72.97%, ప్రోటీన్లు 7.5-12.5%, కొవ్వు పదార్థాలు 1.3 -6.0%  ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి.
  •  జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రకారం సగటున ప్రతి రోజు, ప్రతి వ్యక్తి సుమారు 300 గ్రాముల వివిధ కూరగాయలు, ఆకుకూరలను కూరగా వండుకొని లేదా సలాడ్‌గా తినాలి.
  •  జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రకారం సగటున ప్రతి రోజు, ప్రతి వ్యక్తి సుమారు 30 గ్రాముల నూనెను వంటనూనెల నుండి గాని లేక ఇతర ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. అధిక నూనెలను తీసుకున్నట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది.
  •  ప్రతిరోజు 21 నుండి 70%స్త్ర% వాల్నట్‌ (అక్రోటు కాయ) తినడం ద్వారా శరీరానికి కావలసిన  అతి ముఖ్యమైన ఒమేగా త్రీ  కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థం లభిస్తాయి. తద్వారా శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుదలను  నియంత్రించి గుండెపోటు వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
  •  పాలు  మరియు పాల సంబంధిత పదార్థాలు,  గుడ్లు, మాంసం, చేపలు  మరియు పప్పుధాన్యాలలో అధిక మోతాదులో ప్రోటీన్లు లభించును. జంతువుల నుండి లభించే  ఆహార పదార్థాలలో అధికమోతాదులో నాణ్యమైన  ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన అన్ని రకాల అమినో యాసిడ్స్‌  దొరుకుతాయి. అందుకే గుడ్లను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.
  •  అన్నం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులలో  కొన్ని రకాల  అమైనో ఆసిడ్స్‌ లభించవు.  అందుకనే  అన్నం- పప్పు,  ఇడ్లీ, దోస  వంటి ఆహారంలో  ధాన్యము మరియు పప్పు దినుసుల కాంబినేషన్లో  తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన అన్ని రకాల అమినో యాసిడ్స్‌ లభిస్తాయి.
  • గర్భిణీ స్త్రీలు రోజు సుమారు 8`12 గ్లాసుల శుభ్రమైన కాచి వడపోసిన నీళ్లు  త్రాగాలి.
  •  గర్భం దాల్చిన తర్వాత  మహిళలు సుమారు 350  క్యాలరీల అదనపు  శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. మొదటి త్రైమాసికంలో 0.5 గ్రా. ,రెండవ త్రైమాసికంలో 6.9 గ్రా., మూడవ త్రైమాసికంలో 22.7 గ్రా. అదనపు ప్రోటీనులను ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలలో బరువు పెరగడం కోసం ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.  సుమారు 10 నుండి 12 కిలోల అదనపు  బరువును గర్భిణీ పొందాలి  తద్వారా పుట్టబోయే బిడ్డ సుమారు మూడు కిలోల బరువు ఉండే అవకాశం ఉంది.
  •  గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ మంచి బరువు, ఆరోగ్యంగా ఉండటం కొరకు గర్భం దాల్చిన తర్వాత సుమారు 14 నుండి 16 వారాల తర్వాత అదనంగా శరీరానికి కావలసిన ఖనిజలవణాలు అయినా క్యాల్షియం, ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌ విటమిన్‌  టాబ్లెట్ల రూపంలో తీసుకొనవలెను.
  •  గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం సమస్య రాకుండా పీచు పదార్థం అధికంగా లభించే చిరుధాన్యాలు, తక్కువ పాలిష్‌ చేసిన ధాన్యాలను,  పప్పు దినుసులను మరియు ఆకుకూరలను అధికంగా తీసుకోవాలి.

    Pregnant Women

    Pregnant Women

  • బిడ్డ పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలను  పట్టించాలి. బిడ్డ వయసు రెండు సంవత్సరాలు వచ్చేదాకా తల్లిపాలు తప్పక తాగించాలి.
  •  పాలిచ్చే తల్లులు వారి ప్రాంతాల్లో లభించే వివిధ వైవిధ్యమైన ఆహారపదార్థాలను, మంచి రంగులో ఉన్న ఆకుకూరలు, పండ్లు  మరియు కూరగాయలను సమపాళ్ళల్లో తీసుకోవడం వల్ల తల్లి పాల ద్వారా బిడ్డకు సమతుల్య ఆహారం అందుతుంది.
  • బిడ్డ వయస్సు సుమారు ఆరు నెలలు వచ్చాక తల్లి పాలతో పాటు అదనంగా జావా వంటి ఆహార పదార్థాలను తినిపించాలి. తద్వారా ఎదిగే బిడ్డకు సరైన పోషణ లభిస్తుంది.
  •  ఎదిగే  పిల్లల్లో విటమిన్‌ -ఏ మరియు ఐరన్‌ పోషకాహార లోపాలను అధిగమించడం కోసం వివిధ రంగులలో ఉన్నటువంటి పండ్లు, క్యారెట్లు మరియు ఆకుకూరలను తినే విధంగా ప్రోత్సహించాలి.
  • ఇక్రిసాట్‌ వారు  జొన్నలు మరియు చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తులను  స్మార్ట్‌ ఫుడ్స్‌గా పేర్కొంటారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివి, ప్రకృతిని విషతుల్యం చేయదు  మరియు తక్కువ వనరులతో పండిరచవచ్చు. మార్కెట్‌లో  వీటికి మంచి ధర ఉంది  తద్వారా అధిక లాభాలను రైతులు పొందవచ్చు.
  •  జొన్నలు, చిరుధాన్యాలలో సగటు కార్బోహైడ్రేట్ల  56.88-72.97%, ప్రోటీన్లు 7.5-12.5%  మరియు కొవ్వు పదార్థాలు 1.3 -6.0%  ఉంటాయి.  అంతే కాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి.
  • చిరు ధాన్యాలను (మిల్లెట్స్‌) తరచుగా ఆహారంగా తీసుకోవడం వలన మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, ఆర్త్రిటిస్‌, ఎనీమియా, ఊబకాయం మొదలగు రుగ్మతలు రాకుండా కాపాడుకోవచ్చు
  • వరి, గోధుమల కన్నా  జొన్నలు, చిరుధాన్యాలలో  అధిక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం,  గ్లూటెన్‌ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌, ఇతర  బయో యాక్టివ్‌ సమ్మేళనాలు  కూడా అధికంగా ఉంటాయి.
  • జొన్న లేదా చిరుధాన్యాల గటక్క లేక ఇతర జావా వంటి ఆహార పదార్థాలను పెరుగు లేదా లస్సి లేదా మజ్జిగ వంటివి కలుపుకుని తినడం ద్వారా పెరుగులో ఉన్నటువంటి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ పెంపొందించడానికి తోడ్పడతాయి.
  •  సోయాబీన్‌ పోషక విలువల పరంగా చాలా శ్రేష్టమైనది. ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, ఐరన్‌, జింకు, క్యాల్షియం, ఐసొఫ్లవోన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు విటమిన్లు  దొరికే చౌకైన ఆహార ధాన్యం.
  •  కండరాలు ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి  కావున  ఆరోగ్యమైన కండరాలు, మెరుగైన పనితీరు కోసం  రోజూ తినే ఆహారంలో  ప్రోటీన్లు విధిగా ఉండేటట్లు చూసుకోవాలి.  పాలు మరియు పాల పదార్థాలు, పప్పు దినుసులు, గుడ్లు, మాంసం, చేపలు వంటివి ద్వారా మనకు అధిక మొత్తంలో ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
  •  ప్రతి రోజు శరీరానికి కావలసిన మాంసకృత్తులు వయసు,  శారీరక శ్రమ, ఒత్తిడి  బట్టి మారుతూ ఉంటాయి. ఎదిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు  మరియు  అధిక ఒత్తిడి,  జబ్బులకు మరియు వ్యాధులకు గురైన వారికి అధిక మోతాదులో ప్రోటీన్లు అవసరం. జబ్బులు మరియు వ్యాధుల నుండి కోలుకుంటున్న వారికి  అధిక మోతాదులో ప్రోటీన్లు అవసరం.
  • మాంసకృత్తులు శరీరంలో ఈ క్రింది ప్రక్రియలో నిర్వహించడానికి ఎంతో       ఉపయోగపడతాయి.
  • ప్రొటీన్లు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి.
  •  జీవన క్రియ పెంపొందించడానికి తోడ్పడతాయి.
  •   శరీర నిర్మాణము మరియు గాయాలు, పుండ్లు మానడంలో ప్రొటీన్లు ఎంతో తోడ్పడతాయి.
  • మాంస కండరాల బరువు మరియు ఎముకల యొక్క సాంద్రత   పెరగడంలో తోడ్పడతాయి.
  •  రోగనిరోధక శక్తిని పెంచే ప్రతి నిరోధకాల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  •  శరీరంలోని వివిధ ఎంజైమ్లు మరియు హార్మోన్లు ఉత్పత్తిలో కూడా తోడ్పడతాయి.
  • కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే  తక్షణ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. 11 రకాల స్థూల మరియు సూక్ష్మపోషకాలు తగిన మోతాదులో తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి పెరుగుతుంది. ప్రోటీన్లు, విటమిన్‌- ఏ, విటమిన్‌- సి, విటమిన్‌- డి, విటమిన్‌ -ఈ, విటమిన్‌ -బి 6, విటమిన్‌ -బి 12, పోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, కాపర్‌`జింక్‌.
  •  బత్తాయిలు, కమలాలు, నిమ్మకాయలు మొదలగు సిట్రస్‌ జాతి పండ్లతో పాటు జామ, ఉసిరి వంటివి తినడం వలన శరీరానికి అధిక మొత్తంలో  విటమిన్‌- సి దొరుకుతుంది తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో మనం తయారు చేసుకునే వివిధ కూరలు మరియు ఆహార పదార్థాలలో  పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వాడడం వలన  కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది.
  •  జీవనశైలిలో మార్పు,  సమతుల్యమైన ఆహారము, శారీరక వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని జయించడం  ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
  • శీతాకాలంలో  రోజు  ఒక శుభ్రపరిచిన క్యారెట్ని తినడం ద్వారా శరీరానికి కావలసిన  విటమిన్‌ ఎ, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు  లభించడం వలన ఆరోగ్యంగా ఉంటాము.
  • కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  వారు తీసుకొచ్చిన ఈట్‌ రైట్‌ ఇండియా మరియు ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా  పోషకాహార లోపాలను అధిగమించడం కోసం దుకాణానికి వెళ్లినప్పుడు డబుల్‌ ఫోర్టిఫైడ్‌ ఉప్పును కొని వాడుకో వలెను.
  • కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  వారు తీసుకొచ్చిన ఈట్‌ రైట్‌ ఇండియా మరియు ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా  పోషకాహార లోపాలను అధిగమించడం కోసం దుకాణానికి వెళ్లినప్పుడు ఫోర్టిఫైడ్‌ చేసిన ఉప్పు, పాలు, గోధుమపిండి, వంటనూనెలు కొని వాడుకో వలెను.
  •  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  వారు తీసుకొచ్చిన ఈట్‌ రైట్‌ ఇండియా మరియు ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా  పోషకాహార లోపాలను అధిగమించడం కోసం దుకాణానికి వెళ్లినప్పుడు ఫోర్టి ఫికేషన్‌  సింబల్‌ ఉన్న ఆహార పదార్థాలను కొనవలెను.
  • కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వారు తీసుకొచ్చిన ఈట్‌ రైట్‌ ఇండియా మరియు ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో  కాలానుగుణంగా మీ ప్రాంతంలో లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులను విరివిగా వాడడం వలన పోషకాహార లోపాలను అధిగమించవచ్చు.
  •  తొగరి సోలాలు (పచ్చి కందులు)తో వివిధ సంప్రదాయ ఆహారపదార్థాలు వండుకొని తినే ముందు నిమ్మరసాన్ని కలిపి తింటే కందుల లోని ఐరన్‌ లభ్యత పెరిగి శరీరానికి పుష్కలంగా ఐరన్‌ దొరుకుతుంది.
  • తొగరి సోలాలు (పచ్చి కందులు) మరియు ఇతర పప్పు దినుసులు విరివిగా తినడం వలన పప్పుల్లో ఉండే సూక్ష్మ పోషకాలైన విటమిన్లు  మరియు ఖనిజ లవణాలు లభిస్తాయి.
  • తొగరి సోలాలు (పచ్చి కందులు) మరియు ఇతర పప్పు దినుసుల్లో ఫైటో ఈస్ట్రోజెన్‌  అనే రసాయన పదార్థం ఉంటుంది. పప్పులను తినడం  వలన బుద్ధిమాంద్యం మరియు మోనోపాస్‌ సమస్యలను అధిగమించవచ్చు.
  •  తొగరి సోలాలు (పచ్చి కందులు) మరియు ఇతర పప్పు దినుసుల ఎందుకు తినాలంటే  వీటిలో తక్కువ మోతాదులో చక్కెరలు, కొవ్వు, సోడియం ఉంటాయి మరియు వీటిలో ఎటువంటి కొలెస్ట్రాల్‌ మరియు గ్లూటెన్‌ అనే ప్రోటీన్‌ ఉండదు.
  • తొగరి సోలాలు (పచ్చి కందులు) మరియు ఇతర పప్పు దినుసుల ఎందుకు తినాలంటే  వీటిలో అధిక మోతాదులో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఐరన్‌, పీచుపదార్ధము మరియు పోలిక్‌ యాసిడ్‌ లభించును.
  • మనం తీసుకునే ఆహారంలో తక్కువ మోతాదులో  చెక్కెర, ఉప్పు మరియు తక్కువ పాలిష్‌ చేసిన ఆహార ధాన్యాలు ఉండేటట్టు చూసుకోవాలి.
  •  ఒక నెలలో వివిధ రకాల వంట నూనెలను వాడటం వలన సమపాళ్ళలో శరీరానికి కావలసిన కొవ్వు ఆమ్లాలు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు లభిస్తాయి.
  • చక్కని శరీర బరువు కోసం మొలకెత్తిన పప్పు ధాన్యాల గింజలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్‌, తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు సమపాళ్లలో  తినాలి.
  •  కలుషితమైన వాతావరణ పరిస్థితులలో రోడ్డుపైన దొరికే  జంక్‌ఫుడ్స్‌ తినడం వలన శరీరంలోకి విషపదార్థాలు వెళ్లే ఆస్కారం ఉంది. కలుషిత వాతావరణంలో  జంక్‌ ఫుడ్స్‌ తినవద్దు.వెయ్యి సంవత్సరాల తర్వాత భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్న్‌ 10 నిమిషాల  అవసరం కోసం వాడడం ఎందుకు. ప్రజలందరూ దుకాణానికి సంచి తీసుకొని  వెళ్లి పర్యావరణాన్ని కాపాడుకుందాం.

గమనిక : మహిళలు వివిధ సమయంలో అదనపు ఆహార పరిమాణాన్ని తీసుకోవాలి
గర్భిణీ స్త్రీ :  నూనె మరియు కొవ్వు పదార్థాలు -2, పాలు మరియు పాల పదార్థాలు -2, పండ్లు -1, ఆకుకూరలు -1/2.
పాలిచ్చే తల్లి: ధాన్యాలు-1, పప్పు -2, నూనె మరియు కొవ్వు పదార్థాలు -2, పాలు -2, పండ్లు -1, ఆకుకూరలు-1/2
పాలిచ్చే తల్లి: 6 నుండి 12 నెలల మధ్య, సాధారణ ఆహార పరిమాణం తీసుకోవడానికి తిరిగి రావాల్సి ఉంటుంది

Also Read: Types of Nutrients: పోషకాల రకాలు మరియు వాటి లక్షణాలు.!

Must Watch:

Leave Your Comments

Deficiency Symptoms in Plants: వివిధ పంటలలో సూక్ష్మపోషకాలు ప్రాముఖ్యత, లోప లక్షణాలు, లోప నివారణ.!

Previous article

Pest Control in Cocoa Crop: కోకో పంటలో తెగులు నియంత్రణ.!

Next article

You may also like