Ice Apple Health Benefits: ఇది యాంటీఆక్సిడెంట్ల కు మూలాలైన ఫైటోన్యూట్రియెంట్‌లతో నిండి ఉంటుంది.దీనిలో ఉండే ఫైటోకెమికల్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్లగా పని చేస్తాయి. దీనిని తింటే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి.
Also Read: How Methane Released in Farming: మీథేన్ భూమి నుండి ఎలా వస్తుంది, ఏ విధంగా హాని చేస్తుంది?
బరువు తగ్గడానికి ఇది మంచి ఆహారం. ఐస్ యాపిల్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి వస్తుంది కాబట్టి ఇతర ఆహార మీద కోరికలను తగ్గిస్తుంది.దీనికి శీతలకరణ ప్రభావం ఉండడం వలన ఎండ వేడి స్ట్రోక్‌లను తగ్గించడమే గాక వేడి దద్దుర్లు రాకుండా చూస్తుంది.ముంజ యొక్క తెల్లని మాంసాన్ని దద్దుర్లు మీద పూయడం వల్ల మంట నుండి ఉపశమనం పొందవచ్చు. అవే కాకుండా అజీర్ణం, తిమ్మిరి, మలబద్ధకం లేదా ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది.
ఐస్ యాపిల్ తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడగొచ్చు ?అయితే ఇది తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటం లేదా మెరుగుపరుస్తాయి మరియు వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి కూడా. ఐస్ యాపిల్ తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చును. ఈ పండులో పోషకాలు మరియు విటమిన్లు మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడమే గాక మొత్తంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఎండాకాలం దీనిని రుచి చూసి ఆరోగ్యానికి మేలు చేసుకోండి. ఇది బయట ఒక ముక్కకు 6-8 రూపాయలు గా అమ్ముతున్నారు.
Also Read: Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!