Sapota Health Benefits: సపోటా అనగానే కమ్మని రుచి గుర్తొచ్చి నోట్లో నీళ్ళూరడం ఖాయం. తినేందుకు భలే తియ్యగా వుండే సపోటా మన శరీరానికి అందించే పోషకాలు కూడా ఎక్కువే.
సపోటాలో పిండిపదార్థము పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. ఇందులోని విటమిన్ – ఎ కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉంటాయి.
Also Read: సపోట కోత సమయం లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సపోటా అపారంగా వుండే ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సంజీవనిలా పనిచేస్తుంది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటి లేదంటున్నారు వైద్య నిపుణులు.
సపోటాలోని విటమిన్ – బి, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గర్భిణులకు, పాలు ఇచ్చే తల్లులకు కూడా సపోటాలు మంచి ఆహారం.
రోజూ సపోటా జ్యూస్ తాగేవారికి కేశాలు ఒత్తుగా పెరగడంతోపాటు.. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఊబకాయంతో బాధపడేవారికి ఈ ఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుంది. నిద్రలేమి, ఆందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిది. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ సమస్యకు ఇది మంచి మందులా పనిచేస్తుంది.
Also Read: సపోట సాగు.. లాభాల బాట