ఆరోగ్యం / జీవన విధానం

Peepal Tree Health Benefits: ఒక్క రావి చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు!

3
Peepal Tree Benefits
Peepal Tree Benefits

Peepal Tree Health Benefits: గౌతమ బుధ్ధుడు ఏ చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని అడిగితే టక్కున రావి చెట్టు అని చెబుతాం. అయితే ఈ రావి చెట్టు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియకపోవచ్చు. భారతదేశంలో రావి చెట్టును పవిత్ర చెట్టుగా పూజిస్తారు. రావి చెట్టుని బోధి చెట్టు అని కూడా పిలుస్తారు. రావి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ రెలిజియోస. పూర్వం నుండి ఆయుర్వేదంలో ఈ రావి చెట్టు కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు రావి చెట్టు యొక్క అన్ని భాగాలు పోషక విలువలను కలిగి ఉంటాయి. దీని బెరడు మరియు ఆకుల నుండి తీసిన సారం అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

రావి చెట్టు ఒక రోజులో 2400 కిలోల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ప్రతి రోజు తెల్లవారుజామున ఈ చెట్టు కింద కొద్ది సమయం గడపడం వల్ల ఆస్తమాతో సహా వివిధ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను అద్భుతంగా నయం చేయవచ్చు. ఈ చెట్టు యొక్క పండ్లు మరియు బెరడు కూడా శ్వాసనాళాలను శుభ్రపరచి ఆస్తమా, న్యుమోనియా వంటి వివిధ శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.

Also Read: Watermelon Seeds Health Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

Peepal Tree Health Benefits

Peepal Tree Health Benefits

రావి చెట్టు యొక్క పండు ఆకలిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ రసాలను ప్రేరేపించడానికి మరియు ఆకలిని మెరుగుపరచడానికి ఊదా రంగులో పండిన రావి చెట్టు పండ్లు సహాయపడతాయి. చల్లని వాతావరణం వల్ల కొంతమందికి ముక్కులో నుండి రక్తం కారుతుంది, అలాంటప్పుడు ఈ చెట్టు ఆకుల యొక్క రసం రక్తం కారడాన్ని తక్షణమే ఆపేస్తుంది. రక్తంతో కూడిన విరేచనాల చికిత్సలో కూడా రావి చెట్టు బెరడు అద్భుతంగా పని చేస్తుంది.

చిగుళ్ల నుండి రక్తం కారడం మరియు పంటి నొప్పి వంటి సమస్యలను నివారించడానికి రావి చెట్టు యొక్క బెరడుని వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టు భాగాలతో చేసిన టానిక్ మన శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చెవి నొప్పిని నివారించడంలో కూడా ఇది ప్రయోజకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా దీని ఉత్పత్తులు అద్భుతంగా సహాయపడతాయి. రావి చెట్టు బెరడు నుండి తీసిన కషాయం తాగడం వల్ల ఎక్జీమా మరియు దురద లాంటి చర్మ సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని ఆకుల నుండి తీసిన జ్యూస్ ని కాళ్ళ పగుళ్లపై మసాజ్ చేస్తే నొప్పితో పాటు పగుళ్లు కూడా నయం అవుతాయి. పూర్వం దీని ఆకుల రసాన్ని పాము కాటుకు ఉపయోగించేవారు. ఈ ఆకుల రసం మగవారిలో సంతానోత్పత్తికి కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read: Soybean Pest Management: రబీ సోయా చిక్కుడులో ఆశించిన తెగుళ్ళు నివారణ

Leave Your Comments

Watermelon Seeds Health Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

Previous article

Spotted Pod borer in Greengram: పెసరలో ఆశించే మరుకామచ్చల పురుగు`యాజమాన్యం.!

Next article

You may also like