పుట్టగొడుగులను మానవుడు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆహారంగాను, ఔషధంగాను వాడుతూ వస్తున్నాడు. ప్రకృతి ఇచ్చిన వనరుల్లో పుట్టగొడుగులకు విశిష్ట స్థానం వుంది. పుట్టగొడుగులు శీలింధ్రం జాతికి చెందిన ఒక మొక్క. ఇది నూటికి నూరు శాతం శాకాహారం. పుట్టగొడుగులు వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మానువుడికి కావలసిన విటమిన్ – డి, లవణాలు, బి కాంప్లెక్స్, విటమిన్లు మరియు అమైనో యాసిడ్ (ప్రోటీన్లు) లను సులభంగా పొందగలడు. పుట్టగొడుగుల్లో వుండే ఫోలైట్స్ క్యాన్సర్ నిరోధక శక్తిని ఇస్తుంది. దీనిలో జీరో కొలెస్ట్రాల్ మరియు అధిక శాతం ఫైబర్ లేదా పీచు పదార్ధం ఉండటం వల్ల హార్ట్ పేషేంట్స్ కి, క్యాన్సర్ పేషేంట్స్ కి మరియు కిడ్నీ పేషేంట్స్ కి చాలా మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలను మరియు పిల్లలను విటమిన్ – డి లోపం నుండి కాపాడుతుంది. ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక రీసెర్చ్ నివేదికలో పుట్టగొడుగులు “కరోనా” వైరస్ నుండి కోలుకోవడంలో చాలా ఉపయోగపడుతుందని పేర్కొంది.