ఆరోగ్యం / జీవన విధానం

Ice Apple: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

2
Ice Apple

Ice Apple: మార్చిలోనే మొదలైన వేసవి సీజన్ ఏప్రిల్ లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపానికి ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే శరీరం చాలా వరకు డీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. నిజానికి సమ్మర అంటే మొదటగా మనకు గుర్తు వచ్చేది నోరూరించే మామిడి. మామిడి రుచిని ఆస్వాదించాలి అంటే సమ్మర్ కోసం వేచి చూడాల్సిందే. అయితే వేసవిలో ఇంకోటి కూడా మ‌నంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. అవే తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు

Health Benefits Of Ice Apple

ఎండాకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. ముంజల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటికి పంపుతాయి. ఈ కారణంగా శరీరం అంతర్గతం శుభ్రమవుతుంది.

పొటాషియం అర‌టి పండ్ల‌లో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువును నియంత్రిస్తుంది.

Health Benefits Of Ice Apple

గర్భిణీ స్త్రీలు ఐస్ యాపిల్ తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా సంభవించే మలబద్ధకాన్ని నివారిస్తుంది. వేసవిలో సాధారణంగా ఎక్కువ చెమట పట్టడం వల్ల చాలా అలసిపోతారు. తాటి ముంజలు అలసటని దూరం చేస్తాయి.

Ice Apple

వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ తగ్గి.. దాని స్థానంలో మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

అయితే తాటి ముంజలు అంటే కేవలం తినడమే కాదు కొన్ని ప్రాంతాల్లో వీటిని మరో రకంగా ఉపయోగిస్తారు అక్కడి ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్‌ నుంగు’ అంటారు.

Leave Your Comments

Cucumber Parathas: కీర దోసతో పరాటాలు చేసే విధానం – ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Marigold Health Benefits: మేరిగోల్డ్‌లో గొప్ప ఔషధ గుణాలు

Next article

You may also like