ఆరోగ్యం / జీవన విధానం

Bryophyllum Pinnatum Health Benefits: రణపాలాకువలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
Bryophyllum Pinnatum Health Benefits
Bryophyllum Pinnatum Health Benefits

Bryophyllum Pinnatum Health Benefits: రణపాల ఆకు దీనిని ఆంగ్లంలో బ్రయోఫిల్లమ్ పిన్నాటం అని అంటారు. మిరాకిల్ లీఫ్, ఎయిర్ ప్లాంట్, కేథడ్రల్ బెల్స్, లైఫ్ ప్లాంట్, గోథే ప్లాంట్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది మడగాస్కర్‌కు చెందినది. ఇది క్రాసులేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇంకా ఇది ప్రసిద్ధమైన ఇంట్లో పెంచుకునే మొక్క. ఆఫీసుల పరిసరాల్లో కూడా అలంకరణ కోసం పెంచుకుంటారు. ఇది ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో సహజంగా కనపడే మొక్క.

Bryophyllum Pinnatum Health Benefits

Bryophyllum Pinnatum Health Benefits

మొక్క యొక్క భాగాలు మందంగా, మెత్తగా ఉంటాయి కావున పొడి వాతావరణంలో నీటిని సంరక్షిస్తుంది. ఈ మొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటిహిస్టామైన్ మరియు అనాఫిలాక్టిక్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంతే కాకుండా అధిక రక్తపోటు, తలనొప్పి, చీముపట్టడం మరియు వాపులు వంటి దాదాపు ఏ వ్యాధులనైనా ఇది నయం చేయడానికి తోడ్పడుతుంది.

Also Read: Paddy Cultivation: చౌడు పొలాల్లో వరి యాజమాన్యము

  •  మూత్ర సంబంధిత రుగ్మతల సమస్యలకు : దాహం మరియు మూత్ర వ్యవస్థకు సంబంధిత సమస్యయలతో బాధపడుతున్నప్పు ఆ రోగికి 5 మి.లీ ఆకుల రసాన్ని ఇవ్వాలి. ఇది చాలా మంచి నివారణ. మరియు పురుషులలో మూత్ర సంబంధిత రుగ్మతల సమయంలో, ఆ ఆకు కషాయాన్ని 2 గ్రాముల తేనెతో కలిపి దీన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిది.
  •  కాలిన గాయాన్ని నయం చేయుటకు : ఈ ఆకులను కొద్దిగా వేడి చేసి, దాన్ని చూర్ణం చేసి కాలిన గాయం పై పౌల్టీస్‌గా చేసి కట్టడం వలన దద్దుర్లు, ఎరుపు మరియు వాపు రాకుండా నయం చేస్తుంది.
  • అధిక రక్తపోటు సమస్యకు: దాని ఆకుల భాగం నుండి సారాన్ని తీసి, 5-10 చుక్కలు తీసుకోవడం వలన రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇది తోడ్పడుతుంది .
  •  లుకేమియా సమస్య నివారణకు: దాని వైమానిక భాగం నుండి సారాన్ని తీసి 5-10 చుక్కలు రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన బ్లడ్ క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా మేలు చేస్తుంది.
  •  యోని సంబంధిత సమస్యలకు: స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులను గ్రహిస్తాము. అలాంటి వారికి 40-60 మి.లీ కషాయంలో 2 గ్రాముల తేనె కలిపి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వలన ఉపశమనం కలుగుతుంది.
  • తలనొప్పిని నయం చేయుటకు: దీని ఆకులను చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని నుదిటిపై రాయడం వలన తలనొప్పి నయం అవుతుంది.
  •  కిడ్నీలో రాళ్లను నయం చేయుటకు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ మొక్క యొక్క కషాయాన్ని 40-50 ml తీసుకొని దానిలో500 mg షిలాజిత్ మరియు 2 గ్రాముల తేనెను కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన కిడ్నీ లోని రాళ్ళు కరిగిపోతాయి.
  • గాయాన్ని నయం చేయుటకు: ఆకులను కొద్దిగా వేడి చేసి, తరువాత ఆ ఆకుని నలిపి గాయంపై కడితే ఆ గాయం త్వరగా నయం అవడంతో పాటు మచ్చ పడకుండా కూడా తొలగిస్తుంది.
  • కాలేయానికి మంచిది: రనపాల ఆకు కాలేయం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. మరియు కామెర్లను కూడా త్వరగా నయం చేస్తుంది.
  • జుట్టు పెరుగుదలకు: ఈ మిరాకిల్ లీఫ్‌ని తరచూ తీసుకోవడం వలన జుట్టు తెల్లబడకుండా మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
  • మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉంటుంది: ఎండిన ఆకులతో టీ తయారు చేసి రోజుకు రెండు నుంచి మూడు సార్లు త్రాగడం వలన ఫ్రీ రాడికల్స్‌తో మెరుగ్గా పోరాడటంలో సహాయపడుతుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది: బ్రయోఫిలమ్ పిన్నటం ఆకులతో  కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగండి వలన రక్తంలోని చక్కెర శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
  • మలబద్ధకాన్ని నయం చేస్తుంది: ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి దానితో టీ తయారు చేసుకొని తాగితే మలబద్ధకం నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
  • రక్తాన్ని శుద్ధి చేయుటకు: మిరాకిల్ లీఫ్ కు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. కావున అది టాక్సిన్స్ ను తొలగించి , ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఉపయేగపడుతుంది.

Also Read: Benefits of Eating Chicken: కోడి మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Leave Your Comments

Paddy Cultivation: చౌడు పొలాల్లో వరి యాజమాన్యము

Previous article

Sweet Corn Cultivation: తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు

Next article

You may also like