కాకరకాయ అబ్బ ఎంతో చేదో కదా.. అస్సలు ఆ పేరు వింటేనే పారిపోయే వారు చాలా మందే ఉన్నారు. అదే స్థాయిలో కాకరకాయ ఇష్టపడే వారు కూడా ఉన్నారు. దానిలో ఉండే చేదు చాలా మందిని దూరం చేసుకుంటోంది కాకరకాయ. ఆ చేదే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటే అతిశయోక్తి కాదు సుమా. నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ గుణాల్లో మాత్రం ఎంతో ఉత్తమైనది అంటారు వైద్య నిపుణులు. కాకరకాయ కాలంతో సంబంధం లేకుండా కాస్తూనే ఉంటుంది. పల్లెట్లూర్లలో ప్రతి ఇంటిలోనూ దర్శనం ఇస్తూనే ఉంటుంది. కాకరలో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఉంటాయి. మరి అలాంటి కాకరకాయలో ఉండే ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం..
కాకరకాయ శరీరంలోనే వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు దరిచేరవు. బీపీని కంట్రోల్ లో ఉంచేందుకు కాకర ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్దకం, లివర్, మూత్రపిండాల సమస్యలకు కూడా కాకర మంచి ఆహారం.
మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాలిన గాయాలను, పండ్లను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుద్ధి పరిచి గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.
బరువు తగ్గాలనుకున్నా, శరీరంలో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి. కాకరలోని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం. అందుకే రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. శరీర కాంతిని మెరుగు పరుస్తుంది.
కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తలేమికు పూటకు ఒక చెంచా కాకారకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహాం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది.
కాకరకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments