ఆరోగ్యం / జీవన విధానం

బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు..

0

ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కూరగాయలు ఎన్నో.. కానీ ఇలాంటి పౌష్టికాహారాన్ని ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటి వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. చూడ్డానికి అందంగా కనిపించని బీట్ రూట్ దుంపను తినడానికి పిల్లలైతే ముఖం తిప్పేస్తారు. కానీ బీట్ రూట్ లో ఆరోగ్యసుగుణాలు మెండుగా ఉన్నాయనేది కాదనలేని సత్యం. బయట రూపాయలు ఖర్చుపెట్టి హెల్త్ డ్రింకులను కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా, బీట్ రూట్ లాంటి సహజ సిద్ధ ఆహారాన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, కూర వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాక యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి.
మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్ బీట్ రూట్ లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్ రూట్ లో గ్లుటామైన్, ఎమినో యాసిడ్స్, 3.4గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీర్ణక్రియలను మెరుగుపరుస్తాయి.
బీట్ రూట్ లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు.
బీట్ రూట్ లో ఉన్న నైట్రేట్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్తప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడన నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్ ఎటాక్ వంటి సమస్యలేవి తలెత్తవు.
బీట్ రూట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా వున్నాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని బీట్ రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు.
బీట్ రూట్ ను రోజూ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరంలాంటిది. బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో డీ హైడ్రేషన్ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసమైన నీరు బీట్ రూట్ నుంచి దొరుకుతుంది.
రక్తహీనత ఉన్నవారికి బీట్ రూట్ ఒక దివ్యౌషధం. బీట్ రూట్ ను ప్రతిరోజూ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్ , ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. బీట్ రూట్ సలాడ్ గా గానీ, జ్యూస్ లేదా బీట్ రూట్ డిప్ గాని తీసుకోవడం వల్ల దీనిలో పోషకాలన్నీ మీకు అందుతాయి. దైనందిన ఆహారంలో బీట్ రూట్ ను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చు.

Leave Your Comments

కందులకు సరైన ధరలు లేక రైతుల ఆందోళన..

Previous article

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు వానలు..

Next article

You may also like