ఆరోగ్యం / జీవన విధానం

Green Tea for Weight Loss: బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం గ్రీన్ టీ.!

1
Green Tea
Green Tea

Green Tea for Weight Loss: సాధారణంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళందరూ వాళ్ళ ఆహారంలో భాగంగా గ్రీన్ టీ ని తప్పకుండా తీసుకుంటారు. గ్రీన్ టీ అనేది కామెల్లియా సినెన్సిస్ అనే ప్లాంట్ నుండి తయారు చేయబడిన ఇంకో రకమైన టీ. గ్రీన్ టీ చాలా తేలికగా లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. ఈ టీ లో బ్లాక్ టీ లో ఉండే కెఫీన్ శాతం లో సగం వంతు ఉంటుంది (అనగా ఒక కప్పు కాఫీలో పావు వంతు వరకు ). గన్‌పౌడర్, జాస్మిన్ యిన్ క్లౌడ్ మరియు మొరాకన్ మింట్ అనేవి ప్రసిద్ధమైన గ్రీన్ టీలోని రకాలు.

Green Tea Leaves

Green Tea Leaves

Also Read: Black Tea Unknown Facts: బ్లాక్ టీ గురించి మనకు తెలియని విషయాలు.!

గ్రీన్ టీ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం!
ఆక్సీకరణ ప్రక్రియను ఆపడానికి ఈ ఆకులను కోయగానే వాటిని వెంటనే ఆవిరితో లేదా పాన్‌లో వేసి వేయిస్తారు. ఇలా ఆక్సీకరణను ఆపడం వలనే ఈ గ్రీన్ టీ ఆకులకు ఆకుపచ్చ రంగు మరియు రుచి వస్తుంది. ఆ తర్వాత టీ ఆకులను వత్తడం వలన ఒక ఆకారంలోకి వచ్చాక ఎండబెడుతారు.

Green Tea for Weight Loss

Green Tea for Weight Loss

చైనీస్ గ్రీన్ టీలను మాత్రం ఆక్సీకరణ ప్రక్రియను ఆపడానికి, కోసిన తర్వాత పాన్ లో వేసి కాలుస్తారు.ఈ చైనీస్ గ్రీన్ టీలు జపనీస్ గ్రీన్ టీల కంటే కూడా ఇంకా తేలికగా మృదువైన బంగారు రంగులో కలిగి ఉంటాయి. ప్రసిద్ధ చైనీస్ గ్రీన్ టీలలో డ్రాగన్ వెల్, గన్‌పౌడర్ మరియు చున్ అనేవి కొన్ని రకాలు.

Also Read: Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!

Leave Your Comments

Rythu Bandhu: ఈ నెల 28 నుండి 9వ విడత రైతుబంధు సాయం

Previous article

NFSM-Food Grains Guidelines: NFSM ఆహార ధాన్యాల కోసం 2021-22లో ప్రతిపాదించబడిన కార్యకలాపాలు

Next article

You may also like