Foods that lower Cholesterol: ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పు మనం తీసుకునే ఆహార పదార్థాలు, మానవుని ఆయు: ప్రమాణం నిర్ణయించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. అత్యధికంగా సంభవించే మరణాలలో గుండె సంబంధిత వ్యాధులు కూడా అధిక మొత్తంలో కారణమవుతున్నాయి. జీవన విధానంలో మరియు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ను అదుపు చెయ్యవచ్చు.
ప్రతిరోజు సైక్లింగ్, నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీని వలన గుండె. పటిష్టమౌతుంది, చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి రక్త నాళాల గోడలు దళసరి కాకుండా ఉంటాయి.
కొన్ని ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు. తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన అవి రక్తనాళాలకు మరియు గుండెకు ఎంతో మేలు చేకూరుస్తాయి.
బీన్స్ :
వీటిలో ఉండే కరిగే పీచు, చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్లోని లెసిథిన్, కొలెస్ట్రాల్ కరిగి పోయేలా చేస్తుంది. దీనితో పాటు పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు మరియు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉంటాయి.
వంకాయ :
వంకాయ అనేక ఫైటో న్యూట్రియంట్లు, అనేక రకాల విటమిన్లు , మినరల్స్ కలిగి ఉంటుంది. ఆక్సీకరణ’ ప్రక్రియలో తోడ్పడతాయి.
Also Read: Tomato and Eggplant: టమాట మరియు వంగలో సస్యరక్షణ.!
అవిసె గింజలు :
వీటిలో పీచు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటిని స్మూధీలు, షేక్స్ లో కలువుకోవచ్చు. పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. అంతే కాకుండా మఫిన్, కేక్స్ బేక్ చేస్తున్నప్పుడు కలపవచ్చు.
వెల్లుల్లి :
ఘాటైన వాసన నిచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సరుకు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించ కూడదు. వెల్లుల్లిని ఒలిచి 10 నిమిషాలు అలా ఉంచితే క్యాన్సర్ను నిరోధించే ఎంజైమ్ బాగా మెరుగవుతుంది. రక్తపోటును మరియు ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
సోయా :
8 రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాఖాహర మాంసకృత్తులు సోయాలో ఉన్నాయి. సోయా మాంసకృత్తులు రోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తం నుండి కొలెస్ట్రాల్ను విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుళ్ళల్లో విటమిన్ బి3, బి6, విటమిన్ ఇ లు ఉన్నాయి.
ఓట్ మీల్ :
దీనిలోని బీటా గ్లూకాన్ అనే ప్రత్యేక కరిగే పీచు పదార్థం. స్పాంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ను గ్రహిస్తుంది.
సబ్జా గింజలు :
దీని పొట్టు, ప్రేగులలోనికి కొలెస్ట్రాల్ను ప్రవేశించనీయదు. చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్ధంగా ప్రసిద్ధికెక్కింది.
పొట్టు తీయని గింజలు :
గోధుమ, మొక్కజొన్న, ఓటు ధాన్యం, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం, రక్తపోటు మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు. అలర్జీలు కలిగినవారు గమనించుకొని పైన తెలిపిన ఆహర పదార్థాలను
తీసుకోవాలి.
Also Read: Sesame Crop: వేసవి పంటగా నువ్వులను విత్తుకునుట.!