కరోనా వైరస్ దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. గతంలో కంటే ఈసారి పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం రోగనిరోధక శక్తిని పెంచుకుపోవడంపైనా ప్రత్యేక దృష్టి సారించడం చాలా అవసరం. మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే అంటువ్యాధులతో గట్టిగా పోరాడవచ్చు. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి మీరు ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఈ మూడు డ్రింక్స్ తాగండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి.
రోగనిరోధక శక్తిని పెంచే పానీయం:
ఆపిల్ రసం, అరకప్పు నీరు, 1/4 టీస్పూన్ పొడి అల్లం, 1/4 టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె.
తయారీ విధానం:
ఒక కప్పు నీటిలో అల్లం,పసుపు కలపాలి. నీటిని 5 నుండి 10 నిముషాలు వేడి చేసి, ఆ తర్వాత వాటిని గోరువెచ్చగా చల్లబరిచి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఆ మిశ్రమాన్ని తర్వాత ఫిల్టర్ చేసి ఒక కప్పులో ఉంచి ఆపై తేనె కలపండి. ఈ డ్రింక్లో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉన్నాయి.
సెలెరీ వాటర్:
సెలెరీ గింజలు సగం టీస్పూన్, 5 తులసీ ఆకులు, సగం టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీస్పూన్ తేనె.
తయారీ విధానం:
ఒక పాన్ తీసుకొని ఒక గ్లాసు నీరు, సెలెరీ, తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి వేసి సుమారు 5 నిముషాలు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పులో ఉంచి చల్లబరిచిన తర్వాత తేనెను జోడించాలి.
సెలెరీలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది శోథ, కఫం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవే కాకుండా తులసి ఆకులు, నల్ల మిరియాలు, తేనె మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. తద్వారా మీకు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
ఇమ్యూనిటీ డ్రింక్ :
6 నుండి 7 తులసి ఆకులు, 5 లవంగాలు, ఒక టీస్పూన్ పొడి అల్లం, ఒక కప్పు తిప్పతీగ రసం, 2 టీస్పూన్ల నిమ్మరసం, నల్ల ఉప్పు.
తయారీ విధానం:
ఒక పాన్ తీసుకొని ఒక గ్లాసు నీరు, తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి ఉడకబెట్టాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని చల్లార్చి సీసాలోకి తీసుకోండి. ఒక కప్పు తిప్పతీగ రసంలో ఒక టీస్పూన్ నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ ముందు తయారుచేసిన మిశ్రమాన్ని కలపండి ఈ తర్వాత నిమ్మకాయ కలిపితే చాలు.
వ్యాధినిరోధక శక్తిని పెంచే పానీయాలు..
Leave Your Comments