- బాదం పప్పును నేరుగా తినడం కంటే వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొట్టును తీసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- బాదం పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.
- మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో బాదం పప్పు కూడా ఒకటి.

Almond Seeds
- బాదం పప్పుపై ఉండే పొట్టులో టానిన్ అనే పదార్థం ఉంటుంది.
- బాదం గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లతోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా పొట్టు తీసిన బాదం పప్పును తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
- ఇది బాదంలో ఉండే పోషకాలను పూర్తిగా మన శరీరానికి అందకుండా అడ్డుపడుతుంది. అంతేకాకుండా బాదం పప్పులను పొట్టు తీసి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి.
Also Read: Groundnut Seeds: నేల మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగ గింజలు.!
- రోజూ 5 బాదం గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టి తీసి తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
- నానబెట్టిన బాదం పప్పులో లైపస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
- అంతేకాకుండా బాదం పప్పులను పొట్టు తీసి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి.

Benefits of Almonds
- బాదం గింజలను తినడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు, వృద్ధాప్య ఛాయలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
- అంతేకాకుండా బాదం పప్పుకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా ఉంటుంది.
- గుప్పెడు (సుమారు 28 గ్రాములు) బాదం పప్పులు 161 క్యాలరీలు శరీరానికి అందిస్తాయట. ఇంకా ఇందులో 3.5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల ప్రోటీన్, 2.5 గ్రాముల పిండి పదార్థం, 14 గ్రాముల కొవ్వు, 37 శాతం విటమిన్-E, 32 శాతం మెగ్నీషియం ఉంటాయట.
- అదేవిధంగా బాదం నూనె కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
- బాదం నూనెను రాసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గి యవ్వనంగా కనబడుతుంది. అంతేకాకుండా ఈ నూనెను రాసుకోవడం వల్ల కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.
- వీటిలో సమృద్దిగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాదం గింజలు మనకు సహాయపడతాయి..
- బాదం పప్పును రోజూ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
Also Read: Cashew Nuts Health Benefits: జీడిపప్పులు తినండి.. జ్ఞాపకశక్తిని పెంచుకోండి.!
Leave Your Comments