Spinach Health Benefits: మన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఆకుకూరలు మరియు కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనకు అందుబాటులో ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి, కానీ వాటి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియకపోవచ్చు. ఆకుకూరల్లో ఒకటైన బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇందులో తెలుసుకుందాం. బచ్చలి కూర తీగల్లాగా పెరుగుతూ ఉంటుంది, దీని ఆకులు మందంగా ఉంటాయి. బచ్చలి కూర యొక్క శాస్త్రీయ నామం బసెల్లా ఆల్బా. బచ్చలి కూరలో దాదాపు మన ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. 44 గ్రాముల బచ్చలికూరలో 10 కేలరీలు, 50 గ్రాముల విటమిన్ B9, 0.65 mg ఇనుము, 55 mg కాల్షియం మరియు 0.049 mg కాపర్ లభిస్తాయి. ఇందులో ఇతర ప్రోటీన్లు మరియు ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కావున దీన్ని ఎప్పుడైనా, ఏ రకమైన ఆహారంతోనైనా ఆస్వాదించవచ్చు.
Also Read: Silver Date Palm: వేసవి కాలంలో ఈత పళ్ళను అస్సలు మిస్ కాకూడదు! ఎందుకో తెలుసా?
బచ్చలికూర ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి, ప్రతిరోజూ బచ్చలికూరను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బచ్చలికూర ఐరన్, కాల్షియం, విటమిన్ సి మరియు విటమిన్ ఎ యొక్క అద్భుతమైన మూలం, కావున రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో బచ్చలి కూర మంచి ఫలితాన్ని ఇస్తుంది. బచ్చలి కూరలో లభించే ఫోలేట్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం బచ్చలి కూర కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ ఆహారాన్ని సరిగా జీర్ణించడంలో సహాయపడుతుంది. దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్ లో దీన్ని సులువుగా జోడించుకోవచ్చు.
బచ్చలి కూర నిద్రలేమి సమస్య ఉన్న వారికి మంచి నిద్ర ఉపక్రమించేలా చేస్తుంది. బచ్చలి కూరలో ఉండే పోషకాలు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది. బచ్చలి కూరలో లభించే మెగ్నీషియం, కాల్షియమ్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజకరంగా ఉంటాయి. శరీరంలో పేరుకు పోయిన కొవ్వుని తగ్గించడంలో కూడా ఈ బచ్చలి కూర సహాయపడుతుంది. వీటితో పాటు మన శరీరంలో రక్త ఫలకికల సంఖ్యను పెంచి రక్త హీనతను తగ్గించడంలో కూడా బచ్చలి కూర అద్భుతంగా పని చేస్తుంది.
Also Read: Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు శుభవార్త.!
Also Watch: