Henna (Gorintaku)Health Benefits: అమ్మాయిలకు ఇష్టమైన వాటిలో ప్రధానమైనది గోరింటాకు. గోరింటాకుని ఇష్టపడని అమ్మాయిలు ఉండరేమో. అయితే ఈ గోరింటాకుని కేవలం అందాన్ని పెంచుకోవాడికి మాత్రమే ఉపయోగిస్తుంటారు, కానీ దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గోరింటాకు మొక్క యొక్క శాస్త్రీయ నామం “లాసోనియా ఇన్నర్మిస్”. గోరింటాకులో లభించే వివిధ పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. గోరింటాకు విత్తనాలలో, బెరడులో మరియు ఆకులలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో మరియు షుగర్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
హెన్నా ఆయిల్, బెరడు మరియు విత్తనాలు అనేక ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైపోటెన్సివ్, యాంటీ బాక్టీరియల్, ఆస్ట్రింజెంట్ మరియు యాంటీవైరల్ ప్రభావాలు ఉంటాయి. సాధారణంగా గోరింటాకుని జుట్టుకి సహజ రంగుగా ఉపయోగిస్తుంటారు. వీటిలోని పోషకాలు జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి, అలాగే చుండ్రుని, బట్ట తలను రాకుండా కూడా నివారిస్తుంది. గోరింటాకు ముద్దని గాయాలయిన చోట పెడితే త్వరగా మానుతాయి. అలాగే పుచ్చిపోయిన గోర్లను నయం చేయడానికి కూడా ఈ గోరింటాకు ముద్ద సమర్ధవంతంగా పని చేస్తుంది.
గోరింటాకు మొక్క యొక్క బెరడు మరియు విత్తనాలు జ్వరం తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. గోరింటాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ ప్రభావం వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చర్మాన్ని కాపాడుతుంది.
గోరింటాకుతో చేసే నూనె (హెన్నా ఆయిల్) నిద్రలేమి మరియు ఇతర నిద్ర సంబంధిత సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది. గోరింటాకు మొక్క యొక్క బెరడు నుండి తీసిన సారం కాలేయ సంరక్షణకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గోరింటాకు రసం రొమ్ము కాన్సర్ ని నివారించడంలో కూడా సహాయపడుతుందని తేలింది. వీటితో పాటు గోరింటాకు సారం మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గోరింటాకులోని కొన్ని భాగాలు యాంటీమైక్రోబియల్ ప్రభావం కలిగి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీని యొక్క సారం అంటు వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది తామర మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది.
Also Read: Ashoka Tree Uses: ఆడవాళ్లలో ఈ సమస్యలను తరిమికొట్టే అశోక చెట్టు గురించి మీకు తెలుసా?