Agarbatti (Incense Sticks): ప్రతి భారతీయ ఇళ్ళల్లో, అగరబత్తీలు (అగరుబత్తులు) ప్రార్థనలో ఒక ముఖ్యమైన భాగం, ఇది లేకపోతే ఆ పూజ అసంపూర్ణమే. ప్రతి ఇంటిలో ఈ అగరబత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సువాసనలు వెదజల్లటానికి తప్ప వీటివల్ల వేరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. ఏదేమైనా, ఈ వాస్తవం గురించి మనకు తెలియని విషయం ఏమిటంటే, ఈ రోజువారీ ఆచారం మన ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది.
ఇంటి లోపల అగరబత్తీలను కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే వాయు కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతుంది.ఈ పొగ ఇంటి లోపల వాయు కాలుష్యానికి కారణమవుతుంది, ఇది ఊపిరితిత్తుల కణాల వాపుకు దారితీస్తుంది, దీని వల్ల శ్వాసకోశ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
అగరబత్తులను కాల్చడం ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు: ఊపిరితిత్తులకు గాలిని పంపే శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. వీటిలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు మరియు ఫార్మాల్డిహైడ్ (పార్టిక్యులేట్ మరియు గ్యాస్ రూపంలో) ఉంటాయి, ఇది క్రమం తప్పకుండా పీల్చినట్టయితే ఊపిరితిత్తుల సమస్యలు (COPD) మరియు ఆస్తమా వంటి వ్యాధులకు దారితీస్తుంది.మనం అగరబత్తుల నుండి పీల్చే పొగ సిగరెట్ నుండి వచ్చే పొగ పరిణామం సమానంగా ఉంటుంది.
Also Read: Asparagus Cultivation: ఆస్పరాగస్ సాగులో మెళుకువలు.!
అగర్బత్తీల పొగను దీర్ఘకాలికంగా పీల్చుకున్నట్టయితే కళ్ళకు ఇరిటేషన్ (Eye Irritation) సమస్య వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో దీనికి అవకాశాలు ఎక్కువ. అలాగే, సున్నితమైన చర్మం ఉన్నవారు ప్రతిరోజూ కాలుష్య కారకాలు మరియు పొగను తాకినప్పుడు దురద కూడా సంభవించే అవకాశం ఉంది.
ఈ అగరబత్తుల నుండి వెలువడే పొగ తరచుగా పీల్చడం వల్ల సాధారణ నాడీ సంబంధిత లక్షణాలు, తలనొప్పి, ఏకాగ్రతలో ఇబ్బంది మరియు మతిమరుపు రావడానికి అవకాశాలు ఎక్కువ.ఇవి కాల్చడం వల్ల ఇంట్లో వాయు కాలుష్యం రావడానికి దోహదపడుతుంది, ఇది రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ (CO) మరియు నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) గాఢతను పెంచుతుంది. ఈ వాయువుల అధిక సాంద్రత మెదడు కణాలపై పనిచేయడం ద్వారా నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, అగరబత్తిల పొగను దీర్ఘకాలికంగా పీల్చడం వల్ల స్క్వామస్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. వీటి నుండి వచ్చే పొగలో సీసం, ఇనుము మరియు మెగ్నీషియం మొదలగు విషపూరితమైన వాటి వల్ల శరీరంలో విషభారం పెరుగుతుంది, దీని వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి.అందువల్ల అగరబత్తిలు కాల్చేటప్పుడు పిల్లలను వాటి పొగకి దూరంగా ఉంచండి, అలాగే అవి కాలే సమయంలో కనీసం ఒక్క కిటికీ అయినా తెరిచి ఉంచండి.
Also Read: Dairy Works: డైరీలో ప్రతి రోజు చేయవల్సిన పనులు.!