Biodegradable Products: మనం ఏ హోటల్ లేదా వేడుకలకి పోయిన అక్కడ వాడే వస్తువులు అని పాస్టిక్తో తయారు చేసిన వాటినే వాడుతారు. మన పూర్వ కాలంలో అక్కడకి పోయిన అరటి ఆకులు, గాజు గ్లాసులు వాడుకునే వాళ్ళు. మారుతున్న కాలంతో పాటు ఆహారాన్ని పెట్టె పాత్రలు కూడా మరి పోతున్నాయి. మట్టి కుండలో వంట నుంచి నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకానికి వచ్చాము. ఇప్పుడు బయట ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు అనే పేరు కాకుండా పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అని పిలుస్తున్నారు కానీ అందులో కూడా ఒక చిన్నలేయర్ ప్లాస్టిక్ ఉంటుంది.
ఈ పేపర్ ప్లేట్స్, కప్స్ లో ప్లాస్టిక్ ఉండటం వాళ్ళ మనం అందులో వేడి ఆహారం పెట్టగానే కెమికల్స్ ఉత్పత్తి చేసి ఆహారాన్ని పడు చేస్తాయి. ఈ పేపర్ ప్లేట్స్ లేదా కప్స్ రోజు ఒక సంవత్సరం వాడితే మనకి కాన్సర్ రోగం కచ్చితంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ పేపర్ ప్లేట్స్ని వాడకూడదు అని చెపుతున్నారు. సహజంగా తాయారు చేసే ప్లేట్స్ని వాడాలి అని సూచిస్తున్నారు.
Also Read: Agricultural Scientist: పీహెచ్డీ పూర్తి చేసుకున్న అగ్రికల్చర్ విద్యార్థులకి శుభవార్త..
బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బయో డిగ్రేడబుల్ ఆహార పాత్రల నాణ్యతను విడుదల చేసింది. ఈ బయో డిగ్రేడబుల్ ఆహార పాత్రలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బయో డిగ్రేడబుల్ ఆహార పాత్రలను వాడడం వల్ల మన అందరికి, ప్రకృతికి ఎలాంటి హాని జరగదు.
ఈ బయో డిగ్రేడబుల్ ఆహార పాత్రలు కేవలం వ్యవసాయ వ్యర్థాల నుంచి చెట్ల ఆకుల నుంచి తయారు చేస్తారు. వీటిని ఎన్ని రోజులు అయిన నిల్వ ఉంచవచ్చు. ముడి పదార్థాలు, తయారీ పద్దతి, తయారీ పని తీరు, తయారు చేసే సమయంలో ఎలాంటి శుభ్రత, సూచనల ప్రణాళికలను ఐఎస్ఐ 18267 : 2023 ద్వారా బిఐఎస్ విడుదల చేసింది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్, స్టీట్చింగ్ పద్దతిలో తయారీకి కూడా ప్రాసెస్ పంపించారు.
ఈ బయో డిగ్రేడబుల్ ఆహార పాత్రలను వాడటం ద్వారా రోగాలు తగ్గించుకోవచ్చు, కాలుష్యం కూడా తగ్గించుకోవచ్చు అని బిఐఎస్ ఈ నిర్ణయం తీసుకొని వీటి తయారు చేయాలి అని కంపెనీలని ఆదేశించింది.
Also Read: Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి..