Two-day strike ahead of parliamentary sessions మూడు సాగు చట్టాలను అమలులోకి తీసుకొచ్చి ఏడాది గడిచింది. అయితే కేంద్రం ప్రవేశ పెట్టిన సాగు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాయి. ఈ ఉద్యమంలో 40 రైతు సంఘాలు పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశాయి. కాగా రైతులతో కేంద్రం పలుమార్లు చర్చలకు పిలిచింది. అయితే ఆ చర్చలు ప్రతిసారి విఫలమవుతుండటం జరుగుతూ వచ్చింది. కాగా రైతుల్లో నిరసన మరింత ఉదృతం అవుతుండటంతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై రోజురోజుకి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు చేరుతున్నాయి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రైతులు ప్రధానమంత్రికి పలు డిమాండ్లను పంపారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. తాజాగా ఇదే అంశంపై బ్యూరోక్రాట్లు , ఆర్ధిక శాస్త్రవేత్తలు తమ స్పందన తెలియజేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం అంటే కొన్ని కీలక రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వం సేఫ్ ఆడటం కాదని అభిప్రాయపడ్డారు. చట్టాల సవరణ తదితర ముఖ్యమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. Two-day strike sessions