PJTSAU-21-2022: వ్యవసాయరంగంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను అభివృద్ధి పరచడం అన్న లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని అగ్రి హబ్ ఈ నెల 23న “ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్” పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తుందని ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు తెలిపారు. అగ్రి హబ్ – PJTSAU, టి-హబ్, మరియు రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 9 కళాశాలలు, టి-హబ్, RICH మరియు నాబార్డ్ ల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.

PJTSAU-21-2022
Also Read: Prime Minister’s Awards for Excellence 2022: గడ్చిరోలి అగరబత్తి ప్రాజెక్ట్ కి ప్రధానమంత్రి బహుమతి
“అగ్రి ఫుడ్ సిస్టంలో అగ్రిటెక్ ఆవిష్కరణలు” అన్న థీమ్ తో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. “ది ఫ్లేమ్ అఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్” Tourch Run ను ఏర్పాటు చేయడం వల్ల నవకల్పనలను ఆవిష్కరించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమంను టి-హబ్ నిర్వహిస్తోంది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి అని ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. ఈనెల 28న టి-హబ్ రెండో దశ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు ఈ ‘ఫ్రీ-రన్’ ఈవెంట్ ను రాష్ట్రంలో వివిధ రంగాలలో నవకల్పనలు ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ద్వారా వచ్చే ఈ టార్చరన్ విశ్వవిద్యాలయానికి ఈనెల 23న చేరుకుంటుందని ముగింపు కార్యక్రమం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఉన్న హుబ్ అండ్ స్పొక్ మోడల్ దేశంలోనే వినూత్నమైనదని అన్నారు.
Also Read: Yoga: మంచి జీవన విధానం యోగాతో సాధ్యం