వార్తలు

ఇంటిని ఉద్యానవనంలా మార్చిన దంపతులు..

0

ఇంటి పెరటిని సుందరంగా తీర్చిదిద్దారు తుని పట్టణంలోని బ్యాంకు కాలనీకి చెందిన దంతులూరి కృష్ణంరాజు, రామసీత దంపతులు. ప్లాస్టిక్, మట్టి, పింగాణీ కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. నిత్యం ఇంట్లో వాడిపడేసే ప్లాస్టిక్ సీసాలను వృథాగా బయట పారేయడం ఎందుకు అనుకున్నారు. అంతే వివిధ ఆకారాల్లో వాటిని కత్తిరించారు. రంగులు అద్దారు. వాటిలో కాస్తంత మట్టివేసి మొక్కలు నాటారు. ఇప్పుడు వాటిలో మొక్కలు ఏపుగా, అందంగా పెరిగాయి. ముఖద్వారం ఎదురుగా ఇనుపచట్రం చేయించి కొన్నింటిని వేలాడదీశారు. ఆ ఇంటికి వచ్చేవారు.. ఆ దారిన వెళ్లే వారు పచ్చగా అలరారుతున్న ఆ పెరటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు ఆ దంపతులు. వారికి మొక్కలు పెంచడమంటే ఎంతో ఇష్టం. అలా ఇంటి పెరటిని మొక్కలతో నింపేశారు. ఇంటికి అందమే కాదు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ మొక్కల వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. చల్లదనం కూడా ఉంటుంది. తీవ్రమైన ఎండాకాలంలోనూ వారి ఇంటి పరిసరాలు చల్లగా ఉండటానికి ఈ మొక్కలు దోహదపడుతున్నాయి. అందుకే ఇంట్లో చెట్లు పెంచుకోవాలి.

Leave Your Comments

రంగు రంగు పూలతో టీలు – తయారీ విధానం

Previous article

కరువు సమయంలో పశువులలో చేపట్టవలసిన ఆరోగ్య నిర్వహణ..

Next article

You may also like