Nursery Management Training Program: భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఉద్యాన పంటల్లో నర్సరీ యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కూరగాయల విత్తనాలను ఆధునిక పద్ధతిలో పెంచుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు అని వివరించారు. అలాగే కళాశాల షెడ్యూల్డ్ కులాల విభాగం అధిపతి డాక్టర్ కె.బి ఈశ్వరి పాల్గొని శిక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఆధునిక పద్ధతుల ద్వారా నారు మడిని పెంచుకొని తద్వారా వ్యాపార సరళిలో రైతులు ఎదగాలని సూచించారు.
సాంకేతిక శిక్షణలో భాగంగా రైతులు ప్లగ్ ట్రే విధానంలో కూరగాయల విత్తనాలను ఏ విధంగా పెంచుకోవచ్చునో రైతులకు వివరించారు. మామిడిలో అంటుకట్టు విధానం ద్వారా మొక్కలను ఏ విధంగా ప్రవర్ధనం చేసుకోవచ్చు అని వివరించారు. అలాగే వివిధ రకాల అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలను కొమ్మల కత్తిరింపు ద్వారా ప్రవర్ధనం చేయడాన్ని రైతులకు చూపించారు.
Also Read: Selection and Sowing of Seeds: విత్తన ఎంపిక మరియు కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Nursery Management Training Program
ఉద్యాన విభాగానికి చెందిన డాక్టర్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం. విజయలక్ష్మి మరియు డాక్టర్ కె. చైతన్య పాల్గొని రైతులకు నర్సరీ యాజమాన్యంలోని వివిధ కార్యక్రమాలపై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గోల్లూరు గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ కులాల రైతులు పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు నర్సరీ పెంచుకోవడానికి ఉపయోగపడే ప్లగ్ ట్రే లేదా ప్రొట్రే, నీరు ఇవ్వడానికి ఉపయోగపడే రోజ్ కాన్ మరియు 5 కిలోలు వర్మి కంపోస్టును 30 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ శిక్షణ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Rice Cultivation Methods: వరి సాగు లో వివిధ రకాల విత్తే పద్ధతులు మరియు వాటి యొక్క పూర్తి వివరణ