తెలంగాణవార్తలు

Save Soil: నీరు లేని నేల ఎడారిగా మారుతుంది

1
Save Soil
Save Soil

Save Soil: సద్గురు ఈష ఫౌండేషన్ (Isha Foundation) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి గారు (Singireddy Niranjan Reddy) ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Save Soil

Save Soil

నేలకు అవసరమైన నీరు వర్షాధారమే. వర్షాధారం నుండి వచ్చిన నీటిని నిలువ ఉంచుకుని సముద్రంలో కలిసే నీళ్లను ఎక్కడికక్కడ ఒడిసిపట్టి చెరువులు, కుంటలు, వాగులు , వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా ఈ రోజు తెలంగాణ నేల భూగర్భ జలాలను పెంచడంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా నీటి సంపద. తెలంగాణ నేల అంతా పచ్చబడ్డది. తెలంగాణలో పశువులు, గొర్ల సంపద పెరిగింది. 2019 లెక్కల ప్రకారం 3.26 కోట్ల జీవాలు ఉన్నయన్నారు.

Also Read: Nature of Agriculture: దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి- నిరంజన్ రెడ్డి

రాబోయే తరాల కోసం ఈ నేలను కాపాడుకోవడం ద్వారా ఆహార భద్రతను, పర్యావరణ భద్రతను కాపాడుకోవడం జరుగుతున్నది. జీవనం అంటే మనుషులే కాదు .. అన్ని రకాల జీవులతో మనకు సంబంధం ఉంది .. మనం గాలి పీలుస్తున్నాం, అవి పీలుస్తున్నాం.. అవి జీవించాలి, మనం జీవించాలని గుర్తుచేశారు.

TS Agriculture Minister Singireddy Niranjan Reddy

TS Agriculture Minister Singireddy Niranjan Reddy

కారుణ్యమైన భావనతో ఈ భూమి మీద సమస్త జీవరాశులన్నీ జీవించాలనే భావనతో, సిద్దాంతంతో భావి తరాలకు అందించాలనే సందేశంతో ముందుకు వెళ్తున్న సంస్థకు అభినందనలు .. దానిని మనందరం ఆచరించాలని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈ సంస్థకు అనుబంధంగా ఉండి తోడ్పడుతాం అని చెప్పారు.

మనం తినే ఆహారంలో పరిమితికి మించిన రసాయనాలు ఉన్నాయి. అందుకే 2015 సెప్టెంబరులో యూఎన్ఓ సూచించిన అంశాల కంటే ముందుగానే ఎంతో ముందుచూపుతో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ముందుకు సాగుతున్నదని తెలిపారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లోనే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి అన్నారు.

Also Read: TS Agri Minister: ఉద్యోగులలో స్ఫూర్థి నింపేందుకే అవార్డులు.!

Leave Your Comments

TS Agri Minister: ఉద్యోగులలో స్ఫూర్థి నింపేందుకే అవార్డులు.!

Previous article

Fruit Fly: తీగ జాతి పంటలలో పండు ఈగ సమగ్ర సస్యరక్షణ

Next article

You may also like