తెలంగాణ

Minister Niranjan Reddy: వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి – మంత్రి

2
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న, సాగునీటి శాఖ ఎస్ ఈ శ్రీనివాస్, విత్తన సంస్థ ఎండీ కేశవులు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ,ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి. ఈ వానాకాలంలో సాగు చేయాల్సిన పంటల వివరాలు రైతులకు వ్యవసాయ శాఖ అందజేయాలని వరిలో కూనారం సన్నాలు , కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ ఎన్ ఆర్ 21278, ఆర్ ఎన్ ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా , ఎం టి యూ 1010 , జగిత్యాల 24423, ఐ ఆర్ 64, హెచ్ ఎం టి సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలను మాత్రమే సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ నెలలో రాబోయే మూడు రోజులు, జులై 2వ వారం నుండి మరియు ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించారు.

వర్షాలు ఆలస్యం అయినందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకునేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ముఖ్యంగా తేలికైన నేలలలో వేసే పత్తి 50 నుండి 60ఎంఎం, బరువు నేలలలో 60 నుండి 75 ఎంఎం వర్షపాతం నమోదవుతేనే విత్తుకోవాలని తెలిపారు.

Also Read: Drone Technology In Agriculture: వ్యవసాయంలో డ్రోన్స్ ఎలా వాడాలి..?

Minister Niranjan Reddy

Agriculture Minister Niranjan Reddy

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యాసంగిలో అకాలవర్షాల నుండి వరి పంట నష్టపోకుండా రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకునేలా అవగాహన కల్పించాలి. వరి పంటకాలం ముందుకు జరుపుకునేలా రైతులను చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియో సమావేశంలో విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి అన్నారు.

మార్క్ ఫెడ్ లో తగినంత బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఎరువుల సరఫరా, వినియోగంపై అన్ని జిల్లాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని
రైతువేదికలలో నిరంతరాయంగా రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విత్తనాల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆరుతడి పంటలు వేసుకునే రైతులు బోదెల పద్దతిలో సాగు చేసుకోవాలని ఈ ఏడాది 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ నూతనంగా సాగుచేయాలని ఇప్పటికే 60 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వెళ్తున్నారని మంత్రి అన్నారు.

Also Read: Koonaram Agriculture College: పెద్దపెల్లి జిల్లా కూనారంలో వ్యవసాయ కళాశాలకు సీఎం కేసీఆర్ ఆమోదం

Leave Your Comments

Drone Technology In Agriculture: వ్యవసాయంలో డ్రోన్స్ ఎలా వాడాలి..?

Previous article

Bougainvillaea: ఈ పూవ్వులతో లక్షలు సంపాదించుకోవచ్చు..

Next article

You may also like