తెలంగాణ

Minister Niranjan Reddy: పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు – మంత్రి నిరంజన్ రెడ్డి

2
Cotton Crop
Cotton

Minister Niranjan Reddy: పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆదేశించారు. పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకోవాలని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్ విత్తనాలని అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకటే రకమైనవి మంత్రి అన్నారు. ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రైవేట్ కంపెనీలే అని ప్యాకెట్ ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 450 గ్రాములకు రూ 853/- మంత్రి వెల్లడించారు.

Also Read: Poplar Tree Farming: పాప్లర్ చెట్లతో రైతులకి 5 లక్షల వరకు లాభాలు.!

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని కొన్నికంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అటువంటి డీలర్ల లైసెన్స్ లు రద్దుకు వెనుకాడబోమని అవసరమైన దానికన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు.

ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని అని అన్నారు. ఈ మేరకు 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి .. మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆదేశించారు.

Also Read: Bamboo Rice: ఈ బియ్యం మార్కెట్లో కిలో 500 రూపాయలు.!

Leave Your Comments

Poplar Tree Farming: పాప్లర్ చెట్లతో రైతులకి 5 లక్షల వరకు లాభాలు.!

Previous article

Beat The Heat: వేడిని ఎలా తరిమి కొట్టాలి? అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన చిట్కాలను అనుసరించండి.!

Next article

You may also like