తెలంగాణ

Agri Youth Summit -2023: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా ముగిసిన అగ్రి యూత్ సమ్మిట్ -2023

2
Agri Youth Summit -2023
Agri Youth Summit -2023 at PJTSAU

Agri Youth Summit -2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో వారం రోజుల పాటు నిర్వహించిన అగ్రి యూత్ సమ్మిట్ -2023 ఈరోజు ముగిసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియం లో జరిగిన ముగింపు కార్యక్రమానికి NIPHM డైరక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులలో వ్యవసాయ రంగం లో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వాటిని వ్యవసాయ పట్టభద్రులు అంది పుచ్చుకోవాలని ఆయన సూచించారు.

వ్యవసాయ విద్య ని అభ్యసించడం అదృష్టం గా భావించి ఉద్యోగాలు ఆశించే వారు గా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారు గా ఎదగాలని అన్నారు. పంటల యాజమాన్యం, సస్య రక్షణ,యాంత్రీ కరణ అంశాలలో వినూత్నమైన ఆలోచనలతో వ్యాపార కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపాలన్నారు. ప్లాంట్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసే విధంగా విద్యార్థులకి అవగాహన కల్పించాలని హనుమాన్ సింగ్ విశ్వ విద్యాలయ అధికారులకి సూచించారు. తద్వారా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కలగటం తో పాటు రైతాంగానికి సేవలు అందే వీలు కల్గుతుందన్నారు.

Also Read: Soil Fertilizer Mixture: మొక్కలు పెరగడంలో మట్టి ఎరువుల మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి..

Agri Youth Summit -2023

Agri Youth Summit -2023

ఆధునిక సమాచార పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులకి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ ల ద్వారా సేవలు అందించడం పై దృష్టి పెట్టాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకట రమణ సూచించారు. అగ్రి యూత్ సమ్మిట్ -2023 సందర్బంగా విద్యార్థుల కి వివిధ అంశాల పై పోటీ లు నిర్వహించారు. వాటి లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్స్ ని హనుమాన్సింగ్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు అందచేశారు. ఈ కార్యక్రమం వివరాలని డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ జె. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ సీమ, డాక్టర్ జమునా రాణి, డాక్టర్ నరేంద్ర రెడ్డి, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.

Also Read: Canadian Pygmy Goat: ప్రపంచంలోనే అత్యంత పోటీ విదేశీ మేక… ఇప్పుడు మన దగ్గర పెంచుతున్నారు..

Leave Your Comments

Soil Fertilizer Mixture: మొక్కలు పెరగడంలో మట్టి ఎరువుల మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి..

Previous article

Plant Growth Hormones: మొక్కలో హార్మోన్ల ఉత్పత్తి వల్ల కలిగే లాభాలు ఏంటి.?

Next article

You may also like