Republic Day 2023: 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం వద్ద ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు.
రాష్ట్రం ఏర్పాటైనప్పటినుండి రైతాంగం, విద్యార్థులకి అవసరమైన సేవాలందిస్తు PJTSAU ముందుకెళ్తుందని ఆయన అన్నారు. ఇప్పటికి వివిధ పంటలకు చెందిన 61 కొత్త వంగడాలని విడుదల చేశామన్నారు.
అవసరాలకి అనుగుణంగా కొత్త కళాశాలలు, పాలిటెక్నిక్ లు ప్రారంభిస్తున్నామని సుధీర్ కుమార్ వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం లో కొత్తగా ఆదిలాబాద్ లో అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను, నారాయణపేట లో అగ్రి పాలిటెక్నిక్ ను ప్రారంభిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
ఇందుకు అవసరమైన పోస్టులు, కళాశాల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.