PM Kisan E-KYC: పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు 3 విడతలుగా డబ్బులు ప్రతి నాలుగు నెలలకి విడుదల చేయడం జరుగుతుంది. రైతుల్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రారంభించిన ఈ బృహత్తర పథకం 2019లో మొదలైంది. దాదాపుగా 56 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.కాగా పీఎం కిసాన్ యోజన 11వ విడత సొమ్ముని ఎలాంటి సమస్య లేకుండా పొందాలనుకుంటే వెంటనే eKYCని పూర్తి చేయాలి. eKYC పూర్తి చేయకుండా 11వ వాయిదా మీ ఖాతాలోకి రాకపోవచ్చు. ప్రభుత్వం రైతులందరికీ eKYC పూర్తి చేయడం తప్పనిసరి చేసింది.
eKYC కొన్ని రోజుల పాటు నిలిపివేయబడింది, కానీ ఇప్పుడు అది అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభించబడింది. గత సంవత్సరం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న రైతులకు eKYC ఆధార్‌ను మోడీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
పీఎం కిసాన్ యోజనలో eKYC ఎలా పూర్తి చేయాలి:
* పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* అక్కడ ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ లో ఈ కేవైసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
* E-kyc ఆప్షన్లు మీ యొక్క ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
* పక్కన మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
* తర్వాత get otp అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP రావడం జరుగుతుంది.
* ఆ ఓటిపి ని ఎంటర్ చేసి Submit For Auth అనే దానిమీద క్లిక్ చేయాలి.
* చివరిగా Ekyc Succesful అని వస్తుంది.
మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు కానీ వారు, ఈ-కేవైసి పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని CSC కేంద్రాన్ని సందర్శించండి. ఆ తర్వాత వారితో పీఎం కిసాన్ ఈ-కేవైసి కోసం వచ్చినట్లు చెప్పండి. మీ బయోమెట్రిక్ తీసుకొని పీఎం కిసాన్ ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేస్తారు.
కాగా.. ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సమాధి నిధి కింద 11వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది