వార్తలు

వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్గాలు ..

0

పంటలకు అదనపు విలువను జోడిస్తే మెరుగైన ధరలు వస్తాయని ఇందుకు దేశంలో ఆహార శుద్ధి విప్లవం (ఫుడ్ ప్రాసెసింగ్ రివల్యూషన్) రావాల్సిన అవసరముందని,రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి రానున్నాయని ప్రధాని మోదీ గారు పేర్కొన్నారు.  వ్యవసాయరంగ నిధుల వినియోగంపై సోమవారం ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆయన ప్రసంగించారు. సాగు రంగంలో భాగస్వామ్యం పెరగాలి. పరిశోధన అభివృద్ధివారి తోడ్పాటు ఎంతో అవసరం. ఆంక్షలు, అవరోధాలు వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలకు బడ్జెట్ లో ప్రాధ్యాన్యమిచ్చాము. వ్యవసాయ రుణ పరపతిని రూ. 16.5 లక్షల కోట్లకు పెంచాం. వ్యవసాయ ఉత్పత్తులకు అధిక విలువను జోడించే ఆహార శుద్ధిని విప్లవాత్మక స్థాయిలో చేపట్టాల్సి ఉంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చేపలు తదితర అన్ని విభాగాలకూ దీన్ని వర్తింపజేయాలి. రెండు, మూడు దశాబ్దాల కిందటే ఈ పని చేసుంటే ప్రస్తుత పరిస్థితి ఏంతో మెరుగ్గా ఉండేది.ఫుడ్ ప్రాసెసింగ్ ను విప్లవాత్మక స్థాయిలో చేపట్టేందుకు ప్రభుత్వ ప్రైవేటు రంగాలతో పాటు వ్యవసాయ సమాజం, సహకార వ్యవస్థలు కలిసి రావాలి. పొలాల నుంచి పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తీసుకెళ్లే వ్యవస్థను మెరుగుపరచాలి. మన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను చేరుకునేలా ఒక జిల్లాలో ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి. గ్రామాల సమీపాన వ్యవసాయ పారిశ్రామిక క్లస్టర్లను నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించాలి. బడుగు రైతులు సమస్యల సుడిగుండం నుంచి బయటపడుతుంది.
ప్రపంచ మత్స్య ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. ప్రాసెస్డ్ ఫిష్ మార్కెట్ లో మాత్రం వెనుక సీటుకే పరిమితమయ్యాము. ఈ పరిస్థితి మారాలి భూసారం పట్ల రైతులకు అవగాహన ఉంటే, దిగుబడులు పెరిగే అవకాశముంటుంది. ఒప్పంద సేద్యమన్నది కేవలం వ్యాపార ఆలోచనే కాదు. దీని కింద భూమి పట్ల బాధ్యతను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. వ్యవసాయ ధార అంకుర పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తుంది అని మోదీ గారు వివరించారు.

Leave Your Comments

ఆధునిక పద్ధతిలో నారు పెంపకంలో నూతన ఒరవడి కొనసాగిస్తున్నయువరైతు..

Previous article

శ్రీగంధం చెట్లు పెంచడంతో .. సిరులు

Next article

You may also like