Tomato Price: ఈ నెల మొదటిలో కిలో టమాట 10-20 రూపాయలు ఉండేది. ఇప్పుడు మార్కెట్లో టమాట ధర కిలో 200-250 రూపాయలకి అమ్ముతున్నారు. ఇంత మంచి ధర రావడంతో రైతులకి ఎప్పుడు రాని లాభాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కువ లాభాలు రావడంతో రైతులు చాలా సంతోషిస్తున్నారు. మహారాష్ట్ర, పూణే డిస్ట్రిక్ట్ తుకారాం భాగోజి గాయకర్ గారు ఒక పంటతో కోటీశ్వరులు అయ్యారు.
తుకారాం భాగోజి గాయకర్ గారు 18 ఎకరాల సొంత పొలం ఉంది. అందులో 12 ఎకరాల వరకు టమాట సాగు చేశారు. పంట దిగుబడి కూడా మంచిగా వచ్చింది. పంటకి సరైన సమయంలో నీళ్లు , ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేశారు. దాని వల్ల నాణ్యమైన పంట వచ్చింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది.
Also Read: Turmeric Price: పసుపు పండించిన రైతులకి శుభవార్త… రికార్డు స్థాయిలో పెరిగిన పసుపు ధర…

Tomato Price
ఈ పంట నుంచి 13000 బాక్స్ దిగుబడి వచ్చింది. టమాట రేట్ బాగా పెరగడం వల్ల 1.5 కోట్లు ఆదాయం వచ్చింది. తుకారాం భాగోజి గాయకర్ గారు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశారు కానీ ఇంత మొత్తంలో ఎప్పుడు లాభాలు రాలేదు. ఈ పంటతో ఈ సంవత్సరం మంచి లాభాలు వచాయి అని ఇంటిలో వాళ్ళు అందరూ సంతోషిస్తుంన్నారు.
శుక్రవారం రోజు నారాయంగంజ్ మార్కెట్లో ఒక బాక్స్ ధర 2100 రూపాయలు. గాయకర్ గారు 900 బాక్స్ టమాట అమ్మగా 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు గాయకర్ గారికి టమాట పంట పై 1.5 కోట్లు లాభాలు వచ్చాయి.