తెలంగాణవార్తలు

National Seed Conference 2022: హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన జాతీయ విత్తన సదస్సు.!

1
S Niranjan Reddy
S Niranjan Reddy

National Seed Conference 2022: హైదరాబాద్ నోవాటెల్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐకార్ సీడ్స్ డీజీ డాక్టర్ డీకే యాదవ, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు, NSAI ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, ఇస్టా వైస్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ అల్లెన్, జీఎఫ్ఎ General Agent Of Belateral CoOparation Programme Of BMEL ఉల్రెక్ మిల్లర్, FSII వైస్ ప్రెసిడెంట్ పరేశ్ వర్మ, కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ కమీషనర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

National Seed Conference 2022

National Seed Conference 2022

వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలి. ప్రపంచానికి అవసరమైన ఆహారం రావాల్సింది వ్యవసాయం నుండే. వ్యవసాయం సుస్థిరం, సమర్దవంతం కావాలంటే నాణ్యమైన విత్తనమే ప్రధానం. అందులో భాగంగా వివిధ పంట రకాలను విస్తరించడానికి పరిశోధనలు ముఖ్యం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

దేశంలో దాదాపు 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ప్రైవేటు పరిశోధనా సంస్థలు ఉన్నాయి. పరిశోధనలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జరుగుతున్నవి .. అవి మరింత సమన్వయంతో జరగాల్సిన అవసరం ఉన్నది. విత్తన పరిశోధన ప్రైవేటు రంగంలో ఎక్కువగా ఉన్నది.

National Seed Conference at Hyderabad

National Seed Conference at Hyderabad

ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు కనుక ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అందించడం ప్రథమ కర్తవ్యం. దాంతో పాటు నాణ్యమైన పోషకాహారంపై దృష్టిపెట్టాలి. నాణ్యమైన పోషకాహారం అందించడంలో ప్రపంచం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి జెనీవా సదస్సులో 17 అంశాలలో ప్రపంచం ముందు ఉంచి ప్రపంచ దేశాలు వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. అందులో నాణ్యమైన ఆహారం ఒకటి .. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నాణ్యమైన ఆహారం అందించాలంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మన ప్రధాన విధి. ప్రపంచంలో భారతదేశం నాణ్యమైన విత్తన ఉత్పత్తి దారుల్లో ముందున్నది .. అందులో తెలంగాణ రాష్ట్రం మరింత ముందున్నది. కరోనా విపత్తులో విత్తన ఉత్పత్తి రంగం, విత్తన పరిశ్రమ రంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశం అంతటా అనుసరించడం తెలంగాణకు గర్వకారణం.

National Seed Conference

National Seed Conference

తెలంగాణ ప్రభుత్వం విత్తనరంగం పటిష్టానికి అనేక చర్యలు తీసుకున్నది. విత్తనరంగానికి ప్రోత్సాహమిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడే నాటికి నకిలీ విత్తనాలు పెద్ద సమస్య గా ఉంది. కాబట్టి నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో తొలిసారి పీడీ యాక్ట్ ప్రవేశపెట్టారు .. దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Skoch Summit 2022: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు స్కాచ్ సిల్వర్ అవార్డు.!

జాతీయ విత్తన సదస్సులో విత్తన విక్రేతలు, పరిశోధకులు, ఉత్పత్తిదారులు, పరిశ్రమ వర్గాలు లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. విత్తన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కేంద్రం మీద వత్తిడి తెస్తాం. రాబోయే తరాలకు విత్తన పరిశ్రమ ఉత్తమ ఫలితాలను అందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలి.. జాతీయ వ్యవసాయ విధానం మార్పుపై కేంద్రం దృష్టిసారించాలి అని తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎస్ కే పట్నాయక్ వ్యాఖ్యలు-

ఆహార భద్రత ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలుగా ఉన్నది. పప్పుధాన్యాల కొరత దేశం మొత్తం వేధిస్తున్నది. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన పప్పుధరలు నేడు కిలో రూ.200 పలుకుతున్నది. అధికశాతం పప్పుగింజలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో కేవలం 17 మిలియన్ టన్నుల పప్పుగింజలే ఉత్పత్తి అవుతున్నాయి .. దేశంలో 22 మిలియన్ టన్నుల పప్పుగింజల వినియోగం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎస్ కే పట్నాయక్ అన్నారు.

రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు-

విత్తన రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం దేశంలో మరే రాష్ట్రం ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 30 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత కరంటు, కోటి ఎకరాలకు సాగునీరు, సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు , ఎరువులు అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది. విత్తన పరిశ్రమకు తెలంగాణ సీడ్ హబ్ గా ఎదిగిందని రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు.

National Seed Conference

National Seed Conference

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వ్యాఖ్యలు –విత్తన పరిశోధకుల దృక్పధం మారాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో పోషక భద్రత , ఆహార భద్రత పెద్ద సవాల్. దానిని అధిగమించాలంటే నాణ్యమైన విత్తన పరిశోధనలో ఎంతో కృషి చేయాలి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: 73rd Constitution Day 2022: లాం ఫారంలో ఘనంగా జరిగిన 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.!

Also Watch:

Leave Your Comments

Khammam: ఖమ్మంలో 20,000 MT సామర్థ్యంతో మూడు వేర్ హౌసింగ్ గోదాముల ఏర్పాటు.!

Previous article

Acharya NG Ranga Agricultural University: 306 వ పాలక మండలి సమావేశము.!

Next article

You may also like