Minister Niranajan Reddy: హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో డీసీసీబీ (DCCB) ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అందజేసారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు పాల్గొన్నారు.
Also Read: Asiatic Class Hens: అధిక మాంసం ఇచ్చే ఎసియాటిక్ తరగతి కోళ్ళ రకాలు మరియు లక్షణాలు.!
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత అందిస్తుందని తెలిపారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు రుణాలు ఇవ్వబోతున్నామని సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే హౌసింగ్ రుణాలకు శ్రీకారం చుట్టబోతుందని వెల్లడించారు. ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే ప్రభుత్వ ఉద్దేశం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అని అన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం 2015 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.20 లక్షల సాయం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది అని అన్నారు.
ఇప్పుడు డీసీసీబీ ముందుకు రావడం అభినందనీయం హర్షం వ్యక్తం చేసారు. గతంలో ఆర్థిక చేయూత లేక ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు విద్యార్థులు దూరమయ్యారు.
యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్, రష్యాలలో ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్, ఎంబీబీఎస్ చదువులకు విద్యార్థుల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిభ గల విద్యార్థులు డీసీసీబీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Also Read: Barren Vegetation: వివిధ రకాల బంజరు భూములలో అనువైన వృక్షాల పెంపకం.!