వార్తలు

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం విజ్ఞప్తి…

0
minister niranjan redddy

niranjan reddy

minister niranjan redddy open letter to farmers తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలయిందే ముఖ్యంగా నీళ్ల కోసం. సమైక్య రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితులలో వానలు రాక, కరంటు లేక, సాగు నీరు అందక నిత్యం యుద్దం చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఒడిదుడుకుల అనంతరం 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

cm kcr

ఆరు దశాబ్దాల పాటు సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం నష్టపోయిందని, 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగా బలోపేతం చేయాలని యుద్దప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మూడున్నరేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరరావు ఎత్తిపోతల పథకం నిర్మించారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన రైతాంగానికి సాగు నీరు అందించడం ఒక్కటే మార్గం కాదని ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు విత్తనాలు , ఎరువులు అందుబాటులో ఉంచారు. కేసీఆర్ గారి వ్యవసాయ అనుకూల విధానాలతో ఆకలిచావుల తెలంగాణ అన్నపూర్ణగా మారింది. 2014లో కోటి 31 లక్షల ఎకరాలున్న సాగుభూమి 2021 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. నూతనంగా 80 లక్షల ఎకరాలలో సాగు మొదలయింది. 2014 -15 లో 68.17 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020 – 21 నాటికి సుమారు 3 కోట్ల టన్నులకు చేరింది telangana agriculture

Andhra Pradesh paddy

ఇక దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం అధిక మద్దతు ధర ఇచ్చి దొడ్డు వడ్ల సాగును ప్రోత్సహించింది. బాయిల్డ్ రైస్ ను సేకరించింది. ఇప్పుడు హఠాత్తుగా నిల్వలు పేరుకుపోయాయని బాయిల్డ్ రైస్ సేకరించలేమని స్పష్టం చేసింది. ధాన్యం సేకరణకు కేంద్రానికి రాష్ట్రం ఎంతో సహకరిస్తుంది .. కొనుగోలు చేసిన ఆరు, ఎనిమిది నెలల తర్వాత కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీలు భరిస్తూ పది రోజులలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తుంది. ప్రభుత్వ గోదాంలతో పాటు పాఠశాలలు, పత్తి మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, రైతువేదికలలో ధాన్యం నిల్వకు ఇచ్చి సహకరిస్తుంది. మద్దతుధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి .. ఇది దశాబ్దాలుగా సాగుతున్నది. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతాకుమార్ కమిటీ ధాన్యం ఎగుమతులు చేయాలని , పంటలన్నీ సేకరించాలని చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు telangana farmers

covid on farmers

కేంద్ర మంత్రులు పార్లమెంటులో తలోమాట చెబితే, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంకో మాట చెబుతున్నారు. పచ్చి అబద్దాలతో రైతులను గందరగోళ పరుస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డబల్ గేమ్ ఆడుతుంది.కేంద్రం రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక విధానాల మూలంగా నష్టపోకుండా రైతాంగం వరికి బదులుగా ఇతర పంటలు పండించాలి. కేంద్రం మోసపూరిత విధానాలు పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా ఆరుతడి పంటల వైపు మల్లాలని రైతులను అప్రమత్తం చేస్తున్నది. కేంద్రం కార్పోరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడం లేదు. తెలంగాణ రైతాంగం కేంద్రం అవలంభిస్తున్న భిన్న వైఖరులు గమనించాలి. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. cm kcr

Leave Your Comments

చారిత్రక ఉద్యమానికి ఫుల్ స్టాప్

Previous article

ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత…

Next article

You may also like