వార్తలు

కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలమేరకు కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎంపీ రాములు గారు, ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గార్లు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గార్లు
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం
వట్టెం ద్వారా 1850 క్యూసెక్కుల నీళ్లు
కల్వకుర్తి ఆయకట్టు పెరిగింది.
ఇప్పుడున్న కాల్వల సామర్థ్యం సరిపోదు
అయిదు పంపులు నడిపే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు కాల్వల సామర్థ్యం తక్కువ చేసి నిర్మించడం మూలంగా ప్రస్తుతం ఉన్న ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కావడం లేదు.
కేఎల్ ఐ లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే ప్రతిపాదించి నిర్మించారు.
కానీ నేడు ఆయకట్టు విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకు చేరుకుంది.
పంపులున్నా కాలువల ద్వారా నీళ్లు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల చివరిదశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో కేఎల్ ఐ అదనపు ఆయకట్టుకు పాలమూరు – రంగారెడ్డిలోని వట్టెం రిజర్వాయర్ నుండి నీళ్లందించాలని వచ్చిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమోదించారు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సామర్థ్యం లక్షా 80 వేల ఎకరాలకు ప్రతిపాదించబడింది. నేడు ఈ కాలువ కింద ఆయకట్టు 3 లక్షల ఎకరాలు దాటింది
అందుకే వట్టెం రిజర్వాయర్ నుండి నీరందించనున్నారు.
తక్కువ ముంపుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా రిజర్వాయర్లు నిర్మించాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం
గణపసముద్రం చెరువు కట్టను విస్తరించాలి
డి8, పసుపుల బ్రాంచ్ కెనాల్, డీ5 లను విస్తరించాలని నిర్ణయం
ఖిల్లాఘణపురం మండలం షాపూర్ వద్ద వయోడక్ట్ వెంటనే పూర్తిచేసి రాబోయే వానాకాలం అడ్డాకుల వరకు సాగునీరు అందించాలి
బుద్దారం కాలువపై పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి ఆయకట్టుకు టెండర్లు పిలవాలి
కేఎల్ ఐ పంపులను ఆపిన వెంటనే అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలి
అన్ని చెరువులను కాలువల పరిధిలోకి తీసుకురావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలమేరకు కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎంపీ రాములు గారు, ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గార్లు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గార్లు, సీఈలు హమీద్ ఖాన్, రమేష్, రఘునాధ్ రావు గార్లు, ఎస్ ఈలు సత్యశీలా రెడ్డి, ఎ.సత్యనారాయణ రెడ్డి, డీ ఈలు, ఈఈలు తదితరులు

Leave Your Comments

సపోట సాగు.. లాభాల బాట

Previous article

అరటిలో సస్య రక్షణ చర్యలు ..

Next article

You may also like